హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్ ఇద్దరి వ్యవహారశైలీ సరిగా లేదని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. వెంకయ్యనాయుడు మరో కేంద్రమంత్రి ప్రతాప్ రూఢీ, రాష్ట్రమంత్రి నారాయణతోకలిసి ఇవాళ నెల్లూరులో వివిధ అభివృద్ధికార్యక్రమాలలో పాల్గొన్నారు. ఓటుకునోటు వ్యవహారంపై వెంకయ్య నాయుడు స్పందించారు. ఇద్దరు ముఖ్యమంత్రులూ వివాదాలను చట్టాలకు వదిలి అభివృద్ధిలో పోటీ పడాలని అన్నారు. ఏపీ మంత్రులు గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. వారు సంయమనం పాటించాలని అన్నారు.