వైఎస్ వివేకానందరెడ్డి బయోపిక్ సినిమా తీస్తున్నారని.. తీశారని ఎవరికీ తెలియదు. కానీ పూర్తయిపోయింది. విడుదల అయింది కూడా. హఠాత్తుగా తెరపైకి వచ్చిన ట్రైలర్ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. మంచి క్వాలిటీతో ఉన్న ఆ ట్రైలర్ ఒక్క సారిగా వైరల్ అయింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అనుకుంటూ వస్తున్నారు. కానీ.. సినిమా కూడా రిలీజ్ అయింది. మేకర్స్ ధియేటర్లలో విడుదల చేయాలని అనుకోలేదు. ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా పెయిడ్ స్క్రీనింగ్ కు ప్రాధాన్యం ఇచ్చారు.
వివేకా బయోపిక్ అనే వెబ్ సైట్ లో ఫుల్ మూవీ పెట్టారు. కనీసం వంద రూపాయలు డొనేట్ చేస్తే.. మొత్తం సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఇది పూర్తిగా.. వివేకానందరెడ్డి బయోపిక్ అనే ప్రచారం చేస్తున్నారు ఆయన ఫోటోలను కూడా వాడుకున్నారు. ఇతర సమస్యలు రాకుండా… పబ్లిక్ రిలీజ్ లేకుండా .. ఇలా పెయిడ్ స్క్రీనింగ్ కు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తెలుస్తోది.
ట్రైలర్లో వివేకానందరెడ్డిని ఎవరు చంపారన్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా వివరించారు. పేర్లు కూడా నిజ జీవితంలో ఉన్న పేర్లనే పెట్టినట్లు ట్రైలర్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంత క్వాలిటీగా ఎప్పుడు తీశారబ్బా అని సినిమా ప్రేమికులు కూడా ఆశ్చర్యపోతున్నారు.