హైదరాబాద్: ముగ్గురు అంతర్జాతీయ క్రికెటర్లు – సురేష్ రైనా, రవీంద్ర జడేజా, వెస్టిండీస్ ఆటగాడు బ్రేవో ఒక బుకీనుంచి ముడుపులు తీసుకున్నట్లు లలిత్ మోడి తమకు లేఖ రాసిన మాట నిజమేనని ఐసీసీ నిర్ధారించింది. అతను పంపిన ఈ మెయిల్‌ను తాము భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ వారి అవినీతి నిరోధక విభాగానికి పంపామని తెలిపింది. చెన్నై సూపర్ కింగ్స్‌లో సభ్యులైన ఈ ముగ్గురు క్రికెటర్లూ బెట్టింగ్ వ్యాపారం చేసే హెచ్‌డీఐఎల్ అనే రియల్ ఎస్టెట్ సంస్థ అధినేత బాబా దివాన్నుంచి ముడుపులు తీసుకున్నారని లలిత్ శనివారం ఆరోపణలు చేశారు. ఆ ముగ్గురికి డబ్బుతోబాటు ముంబైలో అపార్ట్మెంట్లుకూడా ఇచ్చారని లలిత్ ట్విట్టర్లో పేర్కొన్నారు.