హైదరాబాద్: ప్రభుత్వాధికారి అవినీతి ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుంది. కడపజిల్లా నందలూరులో పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేసేందుకు రు.4 లక్షలు అడిగిన తహసీల్దార్‌కు నిరసన తెలపటంకోసం సయ్యద్ మక్బూల్ బాషా అనే రైతు సెల్‌టవర్ ఎక్కాడు. అయితే గుండెపోటు రావటంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతుడు నాగిరెడ్డిపల్లెవాసిగా గుర్తించారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నందలూరు తహసీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆర్డీవోను ఆదేశించారు.