కరిగిపోయిన కాలం ఓ జ్ఞాపకం – నడుస్తున్నది మాత్రం అద్భుతం. కాల గమనంలో మరో ఏడాది కలిసిపోయింది. 2024 వచ్చేసింది. గుర్తు చేసుకుంటే ఆ రోజులు ఎంతో అద్భుతం. మళ్లీ వస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇవాళ్టి రోజును కాస్త ముందుకెళ్లినప్పుడు గుర్తు చేసుకుంటే… ఇప్పుడున్న లాంటి రోజులు మళ్లీ వస్తే బాగుండని కోరుకుంటాం. అంటే.. మన జీవితంలో జరిగిన, జరుగుతున్న ప్రతీ క్షణం అద్భుతమే. అస్వాదించడమే మన పని.,
వాస్తవంగా చూస్తే తేదీనే మారుతుంది. కరిగిపోయిన ఏ ఒక్క క్షణం వెనక్కి రాదు. కానీ ఉన్న క్షణాన్ని సద్వినియోగం చేసుకునే చాయిస్ మాత్రం మన చేతుల్లోనే ఉంది. మనం బాగుంటే.. మన కుటుంబం బాగుంటుంది. మనం కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే దేశం బాగుపడుతుంది. అందుకే ఎవరినో బాగు చేయడానికి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకుండా.. .. ఏ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలుసుకుంటే.. కొత్త ఏడాది కూడా సాఫీగా సాగిపోతుంది.
ప్రతి ఒక్కరికి లక్ష్యాలు ఉంటాయి. బైక్ లేని వాళ్లు బైక్ కొనుక్కోవాలనుకుంటారు.. ఉద్యోగం లేని వాళ్లు ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంటారు. అవి ఉన్న వాళ్లు అంత కంటే పెద్దది మరో గోల్ పెట్టుకుంటారు. అది ఆశ కాదు. ఎలాంటి గోల్ అయినా పెట్టుకోవచ్చు.. ప్రయత్నించి అందుకోవడంలోనే మజా ఉంటుంది. కష్టపడితే.. కష్టపడిన మార్గంలోనే కాకుండా.. చాలా మార్గాల్లో విజయం దరి చేసే అవకాశం ఉంటుంది. అయితే అన్నింటి కంటే ముందు తెలుసుకోవాల్సింది.. జీవితానికి ఏది ముఖ్యమని, చాలా మంది డబ్బే ముఖ్యమనుకుంటారు.
జీవితంలో డబ్బే ముఖ్యమైతే ఆర్థిక సమస్యలు లేని వాళ్లు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు. డబ్బు కూడా ముఖ్యం. కానీ డబ్బే ముఖ్యం కాదు. డబ్బుకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చి.. . ఇతర జీవితాన్ని సాఫీగా సాగేలా బ్యాలెన్స్ చేసుకుంటే… . 2024 హ్యాపీగా నడిచిపోతుంది. ఆనందాన్ని డబ్బు పెట్టి కొనలేరు.
హ్యాపీ న్యూ ఇయర్