శర్వానంద్ ‘మనమే’ రావడానికి ఇంకా వారం రోజులే వుంది. ఇప్పటికే కొంత ప్రమోషనల్ కంటెంట్ బయటికి వచ్చింది. ఇప్పుడు టప్పా టప్పా అనే పాట ని వదిలారు. ఇదొక పెళ్లి పాట. ట్యూన్ విజువల్స్ ఆహ్లాదకరంగా వున్నాయి. హేషామ్ అబ్దుల్ వహాబ్ తనదైన బాణీలో కంపోజ్ చేశాడు. రామ్ మిరియాల వాయిస్ కొంత ఎనర్జీని ఇచ్చింది. కాసర్ల శ్యామ్ సాహిత్యం కూడా అలరించేలానే సాగింది.
శర్వానంద్ స్టైలింగ్, డ్యాన్స్ కొత్తగానే వున్నాయి. ఈ పాటలో శివకందుకూరి ఆయేషా ఖాన్ పెళ్లి జంటగా కనిపించారు. లొకేషన్ చాలా రిచ్ గా వుంది. ఈ సినిమాని దాదాపు విదేశాల్లో చిత్రీకరించారు. శర్వానంద్ తో పాటు దర్శకుడు శ్రీఆదిత్యకి కూడా ఈ సినిమా చాలా కీలకం. జూన్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.