టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ రౌడీలు దాడి చేశారు. సీసీ కెమెరా దృశ్యాల్లో అందరూ దొరికిపోయారు. కానీ ఒక్కరిపై కేసు పెట్టలేదు. కానీ గుంటూరులో ప్రభుత్వ లిక్కర్ తాగి.. న్యూ ఇయర్ పేరుతో రోడ్లపై తిరుగుతూ మధ్యలో విడదల రజనీ కార్యాలయంపై మందుబాబులు దాడి చేస్తే మాత్రం ఏకంగా యాభై మందిని అప్పటికప్పుడు అరెస్టు చేశారు. మీడియా ముందుకు వచ్చిన మంత్రి గారు ఎవర్నీ వదిలి పెట్టబోమని హెచ్చరించారు. సూత్రధారుల్ని, పాత్రధారుల సంగతి తేలుస్తామని హెచ్చరించారు.
న్యూ ఇయర్ సంబరాల్లో భాగంగా ర్యాలీలు చేస్తున్న వారు.. కొంత మంది మద్యం మత్తులో విద్యానగర్ లో విడదల రజని ఏర్పాటు చేస్తున్న కార్యాలయంపై రాళ్ల దాడులకు దిగారు. ఈ కార్యాలయం ఓపెన్ కాలేదు. కార్యాలయం కాస్త ధ్వంసమయింది. దీనిపై రచ్చ చేశారు. పోలీసులు హుటాహుటిన యాభై మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ దాడి జరిగిన వెంటనే అందరూ.. టీడీపీ ఆఫీస్‌పై జరిగిన దాడి విషయంలో పోలీసుల స్పందనను గుర్తు చేసుకుంటున్నారు.
అప్పట్లో వైసీపీ నేతలకు బీపీలు వచ్చాయని జగన్ రెడ్డి సమర్థించుకున్నారు. దాంతో పోలీసులు అసలు చర్యలు తీసుకోలేదు. ఓ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రధాన కార్యాలయంపై మారణాయుధాలతో దాడి చేసినా కేసులు లేవు. కానీ మద్యం మత్తులో ఇంకా ప్రారంభం కాని.. పార్టీ ఆఫీసుపై దాడి జరిగితే మాత్రం హడావుడి చేస్తున్నారు అసలు దాడి చేసిన వారు టీడీపీ వారో వైసీపీ వారో క్లారిటీ లేదు. గుంటూరు పశ్చిమలో టిక్కెట్ కోసం నలుగురు పోటీ పడుతూంటే ఎవరికీ కాకుండా.. విడదల రజనీకి ఇచ్చారు జగన్. అక్కడే వారి మధ్య తేడాలొచ్చాయని చెబుతున్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలోనే వైసీపీ నేతలకు ఇంత వ్యతిరేకత కనిపిస్తూంటే.. రేపు అధికారం పోయిన తర్వాత ఎవరైనా ఏపీలో ఉండగరా అన్న సందేహం ఎవరికైనా వస్తుంది. అంతగా వేధింపులు ఎదుర్కొన్నారు టీడీపీ కార్యకర్తలు.