హైదరాబాద్: విజయవాడ నగరంలో ఇవాళ జరిగిన కల్తీ మద్యం ఘటనలో ఏడుగురు చనిపోయారు… మరో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరంతా కృష్ణలంక ప్రాంతంలోని స్వర్ణ బార్లో చీప్ లిక్కర్ తాగారని బాధితుల బంధువులు చెప్పారు. ఈ బార్ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లాది విష్ణుదని తెలిసింది. తన పేరు మీడియాలో మార్మోగటంతో దీనిపై విష్ణు వివరణ ఇచ్చారు. ఆ బార్ తనది కాదని, తన బంధువులదని చెప్పారు. అయినా కూడా ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగాలని అన్నారు. బార్లో కల్తీ మద్యం అమ్మరని, వాటర్ కూలర్లో ఏదైనా కలిసి ఉండొచ్చని చెప్పారు. మినరల్ వాటర్‌తో మద్యం తాగినవారు బాగానే ఉన్నారని అన్నారు. బార్‌తో గానీ, బార్ కార్యకలాపాలతో గానీ తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.