హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్రెడ్డిరిమాండ్ను ఏసీబీ న్యాయస్థానం ఈనెల 29వరకు పొడిగించింది. రేవంత్ రిమాండ్ ఇవాళ్టితో ముగియటంతో ఏసీబీ పోలీసులు ఈ రోజు నిందితులందరినీ కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు పూర్తికాలేదని, ఇంకా సాక్ష్యాలు సేకరించాల్సిఉందని ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించిన మెమోలో పేర్కొన్నారు. మరోవైపు రేవంత్ సోమవారం బెయిల్‌కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఏసీబీవారి దర్యాప్తు పూర్తయిందని, తనను నాలుగు రోజులు కస్టడీలో విచారించారని రేవంత్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో కొత్తగా విచారించేదేమీలేదని, కస్టడీకి ఆటంకం కలిగించబోనని తెలిపారు. తాను ప్రజాప్రతినిధిగా ఉన్నానని గుర్తుచేశారు. రేవంత్తోబాటు సెబాస్టియన్, ఉదయసింహకూడా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.