అజ్ఞాతవాసి ఆడియో ఫంక్షన్ నిన్న చాలా ఘనంగా జరిగింది. వేరే హీరోలు ఎవరు గెస్ట్ గా లేకుండా కేవలం అజ్ఞాతవాసి సినిమాకు సంబంధం ఉన్నవాళ్ల మధ్యనే ఆడియో ఫంక్షన్ జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పారు. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా జల్సా . ఇది మరీ పెద్ద హిట్ కాకపోయినప్పటికీ ఫ్లాపుల నుంచి పవన్ కళ్యాణ్ ని బయటపడేసింది కమర్షియల్ గా కూడా హిట్ అనిపించుకుంది. అయితే అప్పట్లో ఈ సినిమా హిట్టయిన విషయమే తనకు తెలియదని ఆ సినిమా హిట్ అని తెలియడానికి తనకి మూడు సంవత్సరాలు పట్టిందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
అయితే పవన్ కళ్యాణ్ స్పీచ్ కూడా చాలావరకు ఫిలసాఫికల్ గా సాగింది తాను డిప్రెషన్లో ఉన్నప్పుడు త్రివిక్రమ్ తనని డిప్రెషన్ లో నించి బయట పడేశాడని చెప్పాడు. గతంలో కూడా తాను రకరకాల సమస్యలతో మానసికంగా అలసిపోయిన సమయంలో ఆయనే తనకు వెన్నుదన్నుగా నిలిచాడని చాలాసార్లు చెప్పాడు. కానీ తాను నటించిన సినిమా ఆడిందా లేదా తెలుసుకోవడం కూడా చేయనంతగా అందరితోనూ కనెక్షన్ కట్ చేసుకుని తాను ఒంటరిగా కొన్నేళ్ల పాటు డిప్రెషన్ లో ఉండిపోయినట్లు మాత్రం ఇప్పుడే చెప్పారు. కొంచెం నిర్మొహమాటంగా మాట్లాడుకుంటే సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు డైరెక్టర్లు నిర్మాత తో సహా హీరోయిన్లు నటులు అందరూ ఏదో ఒక సందర్భంలో డిప్రెషన్‌కు గురైనవారే కానీ దాన్ని చాలామంది బయటకు చెప్పుకోరు . పవన్ కళ్యాణ్ దాన్ని ఇలాంటివి పబ్లిక్ వేదిక మీదే నిర్మొహమాటంగా చెప్పుకుంటారు.
తమ సినిమా ఆడిందా లేదా, రికార్డులు బ్రేక్ చేసిందా లేదా, ఎన్నికేంద్రాల్లో 50 రోజులు ఆడింది, ఎన్ని కోట్లు గ్రాస్ వచ్చింది అని సినిమా విడుదల అయిన నాటి నుండి ఫాలో అప్ చేసే హీరోల మధ్య మూడేళ్ళ వరకు అది హిట్టని కూడా తెలుసుకోలేకపోయానని చెప్పే పవన్ కొంచెం విభిన్నం గా కనిపిస్తాడు.