‘భాజపా మీద వ్యాఖ్యలు చేసేటప్పుడు సంయమనం పాటించాలి. పొత్తు పై తెగే దాకా లాగే మాటలొద్దు.’ …ఇలాంటి పలు రకాల ఆదేశాలను ఇచ్చింది సాక్షాత్తూ అధినేత అయినా తెలుగు తమ్ముళ్లు ఆగడo లేదు. కమల దళం పై కదన కుతూహలం చూపడం మానలేదు.
నిన్న భాజపా ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ… చంద్రన్న కానుక సరకుల్లో నాణ్యత లేదని, కనీసం రేషన్ సరుకులు సక్రమంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలవరం పై రాష్ట్రం.. కేంద్రానికి సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇలాగే తెదేపా ప్రభుత్వం పై రకరకాల విమర్శలు గుప్పించి, తెదేపా పై పోరాటం లో సోము వీర్రాజు ఒంటరి కాదని చెప్పకనే చెప్పారు.
దీనికి సమాధానం గా అన్నట్టు బుధవారం తెదేపా ఎమ్మెల్సీ జగదీశ్ భాజాపా పై విరుచుకు పడ్డారు. భాజాపా తన గురించి తాను అతిగా ఊహించుకుంటూన్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు. తమిళనాడు ఎన్నికల్లో ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు పడ్డాయి అని గుర్తుంచుకోవాలి అన్నారు. పోలవరం పై భాజపా నేతలు అడుగడుగునా అడ్డు తగులుతున్నారని ఆరోపించారు.
మొత్తం మీద భాజాపా, కేంద్రం మీద విమర్శలు వద్దంటూ చంద్రబాబు చెబుతున్నా ఎందుకనో తెదేపా నేతలు లక్ష్య పెట్టడం లేదు. దానికన్నా మించి… ఈ విమర్శల పర్వం బాబు డైరెక్షన్ లొనే జరుగుతోంది అని భాజపా నేతలు సందేహిస్తుండడమే ఆయనకు మరిన్ని సమస్యలు తెచ్చి పెడుతోంది.