హైదరాబాద్: ఈ సంవత్సరం జూన్ 30వ తేదీ ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఈ తేదీనాడు రోజులో ఉండే 24గంటల సమయానికి ఒక సెకనును అదనంగా చేర్చనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనాసంస్థ నాసా ప్రకటించింది. సాధారణంగా రోజుకు 86,400 సెకన్లు ఉంటాయి. అయితే భూమి, చంద్ర, సూర్యులమధ్య జరిగే గురుత్వాకర్షణశక్తి పోరు కారణంగా భూ భ్రమణ వేగం క్రమేణా కొద్దికొద్దిగా తగ్గుతోంది. దీనిని పూడ్చటంకోసం అప్పుడప్పుడూ ఒక సెకనును జూన్ 30న గానీ, డిసెంబర్ 31నగానీ కలుపుతారు. ఈ సెకనును లీప్ సెకను అంటారు.