హైదరాబాద్: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆర్కే నగర్ ఉపఎన్నికలో భారీ మెజారిటీతో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, సీపీఐ నాయకుడు మహేంద్రన్ను ఆమె లక్షన్నరపైగా ఆధిక్యంతో ఓడించారు. ఓటర్లకు, పార్టీ కార్యకర్తలకు జయ కృతజ్ఞతలు తెలిపారు. తన విజయం రానున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంకేతం అని వ్యాఖ్యానించారు.
గత ఏడాది సెప్టెంబర్లో అవినీతికేసులో జైలు శిక్ష పడటంతో జయలలిత ముఖ్యమంత్రి పదవిని, ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు. అయితే కర్ణాటక హైకోర్టు ఆమెను నిరపరాధిగా తేల్చటంతో ఆమె గత నెల 23న మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్కే నగర్ నియోజకవర్గంలో అన్నా డీఎంకే ఎమ్మెల్యే వెట్రివేల్ రాజీనామా చేసి జయ పోటీ చేయటానికి వీలు కల్పించారు. ఆదివారం అక్కడ ఉపఎన్నిక జరిగింది.