ఏపీ రాజధానిపై ఐవైఆర్ కృష్ణారావు రాసిన ‘ఎవరి రాజధాని అమరావతి?’ పుస్తకాన్నిఈ రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో అడ్మిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అన్నీ ఎకరాల్లో లెక్కగడితే, రాజ్‌భవన్‌తో సహా 200 ఎకరాలేనని అన్నారు. మూడు పంటలు పండే భూములను రైతుల దగ్గర్నుంచి బలవంతంగా తీసుకున్నందుకే తాను రోడ్ల మీదికి రావాల్సి వచ్చిందన్నారు.
అయితే ఐవైఆర్ రాసిన పుస్తకానికి వ్యతిరేకంగా ‘ప్రజా రాజధానిపై కుట్ర’ పుస్తకాన్ని టీడీపీ నేత వర్ల రామయ్య ఆవిష్కరించారు. ఐవైఆర్ ఛీఫ్ సెక్రటరీ గా ఉన్నప్పుడే భూసమీకరణకు రూపకల్పన జరిగిన విషయాన్ని వర్ల గుర్తు చేసారు. అప్పుడు రాజధానిపై ఎటువంటి అభ్యంతరాలు తెలపని ఐవైఆర్ ఇప్పుడు రాజధానికి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు వర్ల రామయ్య. మొత్తానికి పోటాపోటీ పుస్తకావిష్కరణలతో రాజధాని ప్రాంతం సందడిగా మారింది.