త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించే సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించడం కోసం ఎన్టీఆర్ మూడు నెలల్లో ఇరవై కిలోల బరువు తగ్గారు. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో తగ్గడంలో వింతేముంది? సెలబ్రిటీ ట్రయినర్ సమక్షంలో ప్రతి రోజూ వర్కవుట్స్ చేస్తున్నారు. స్ట్రిక్ట్ డైట్ మెయింటైన్ చేస్తున్నారు. బరువు తగ్గడం సులభమే కదా… అని కొందరు అనుకోవచ్చు. కానీ, సెలెబ్రిటీ ట్రయినర్ సమక్షంలో వర్కవుట్స్ చేయడం అంత ఈజీ కాదు గురూ! ఓసారి ఫొటోపై లుక్కేయండి… ఎన్టీఆర్‌ని ట్రయినర్ ఎంత కష్టపెడుతున్నాడో? అభిమానులకు ఎన్టీఆర్ హీరో కావొచ్చు. కాని ఆయన శరీరానికి మాత్రం ఎప్పట్నుంచో తెలిసిన మనిషే. బరువు పెరగాలంటే ఇష్టం వచ్చినట్టు తింటే సరిపోతుంది. కాని తగ్గాలంటే శరీరం చెప్పినట్టు చేయాల్సిందే. అందుకోసం ట్రయినర్ హెల్ప్ తీసుకుని వర్కవుట్స్ చేస్తూ కష్టపడాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్నది అదే.