బిగ్ బాస్ షోతో తనలో టాలెంట్‌ని ఓ కొత్త రూపంలో ప్రదర్శించాడు ఎన్టీఆర్. ఈ బుడ్డోడి వ్యాఖ్యానంతో.. తెలుగులో బిగ్ బాస్ షోకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ 2 సీజన్ మొదలవ్వబోతోంది. ఈసారి మాత్రం ఎన్టీఆర్ వ్యాఖ్యానానికి దూరమయ్యాడు. దానికి కారణం తన బిజీ షెడ్యూలే. త్రివిక్రమ్ సినిమాని వీలైనంత తొందరగా ముగించాలన్న తపనతో ఉన్న ఎన్టీఆర్…. బిగ్ బాస్ 2 కి అందుబాటులో ఉండనని చెప్పేశాడు. ఎన్టీఆర్ స్థానంలో నాని వ్యాఖ్యాతగా మారబోతున్నాడు. ఇందుకు సంబంధించి `స్టార్ మా`తో నాని ఎగ్రిమెంట్లు చేసుకోవాల్సివుంది. అయితే… నాని వ్యాఖ్యానం ఈ ఒక్క సీజన్‌కి మాత్రమే. మూడో సీజన్లో.. మళ్లీ ఎన్టీఆరే పగ్గాలు తీసుకుంటాడని, ఎన్టీఆర్ సన్నిహితులు చెబుతున్నారు. కేవలం షూటింగ్ బిజీతో.. ఈ సీజన్‌కి అందుబాటులో ఉండడం లేదని, బిగ్ బాస్ 3లో మాత్రం ఎన్టీఆర్ తప్పక కనిపిస్తాడని మా టీవీ వర్గాలు కూడా చెబుతున్నాయి. సో.. బిగ్ బాస్ గా మళ్లీ ఎన్టీఆర్‌ని చూడొచ్చన్నమాట.