‘మా’ సభ్యత్వం కోసం శ్రీరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ ముందు చేసిన అర్థనగ్న ప్రదర్నన కాస్త సంచలనంగా మారింది. ‘మా’ సభ్యత్వం కోసం ఒకరు ఇలా రోడెక్కడం… తెలుగు చలన చిత్రసీమ చరిత్రలోనే ఇది మొదటి సారి దీనిపై `మా` కూడా ధీటుగానే స్పందించింది. ఇలాంటి వేషాలేస్తే.. ‘మా’ సభ్యత్వం ఇవ్వమని సభ్యులంతా మూకమ్ముడిగా గొంతు విప్పారు. `మా` కౌన్సిల్లో కీలక సభ్యురాలైన హేమ… శ్రీరెడ్డిపై ఫైర్ అయ్యింది. హేమ కామెంట్లలో కీలక అంశాలు ఇవీ..
మా మెంబర్ షిప్ కోసం శ్రీరెడ్డి సంప్రదించింది. ఆమెకు మేం అప్లికేషన్ కూడా ఇచ్చాం. కానీ దాన్ని సరిగా పూర్తి చేయకుండానే ఇచ్చేసింది. కనీసం ఫొటోలు కూడా అతికించలేదు. డీడీ ఇవ్వలేదు. అలాంటప్పుడు ఆమె అప్లికేషన్ని ఎలా అంగీకరిస్తాం?
నేను నటిగా 375 సినిమాలు చేశా. సినిమాలంటే నాకు ప్రాణం. సినిమాలు చూస్తూనే ఉంటా. ఎక్కడా నేను శ్రీరెడ్డిని గుర్తించలేదు.
ఆమెకు ఫ్రీ మెంబర్ షిప్ కావాలట..? తెలుగు సినిమా కోసం శ్రీరెడ్డి ఏం త్యాగాలు చేసిందని, ఫ్రీ మెంబర్ షిప్ ఇవ్వాలి?
ఇంట్రడ్యూస్ చేయడానికి ఇద్దరు మెంబర్ల సంతకాలు కావాలి. కనీసం తను ఒక్క సంతకం కూడా పెట్టించలేదు.
మా అప్లికేషన్లు ఇప్పటికే చాలా మందివి పెండింగ్లో ఉన్నాయి. వాళ్లెవ్వరికీ ఇవ్వకుండా శ్రీరెడ్డికి ఎలా ఇస్తాం?
శ్రీరెడ్డి అప్రోచ్ అయిన విధానం మాకెవ్వరికీ నచ్చలేదు. నిరసన తెలపాలంటే చాలా మార్గాలున్నాయి. మౌన పోరాటం కూడా చేయొచ్చు. ఇలా అర్థనగ్న ప్రదర్శనతో రోడెక్కడం కరెక్ట్ కాదు.విప్పుకుంటే వేషాలిస్తారనుకుంటుందా?
శ్రీరెడ్డిలాంటివాళ్లని చూస్తుంటే.. ఇలాంటి పరిశ్రమలో మేమంతా ఉన్నామా అనిపిస్తోంది.
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు దొరకడం లేదనడం భావ్యం కాదు. నేను తెలుగుఅమ్మాయినే కదా? ఇక్కడ ప్రతిభ ఉన్నవాళ్లకే అవకాశాలు వస్తాయి. శ్రీరెడ్డిని చూస్తే అక్క, చెల్లె, వదిన పాత్రల్లో ఊహించుకోగలమా? చిత్రసీమలో రాణించడం అదృష్టం. హిట్టయితే పది సినిమాలొస్తాయి. లేదంటే లేదు.