విశాల్ లేటెస్ట్ మూవీ ‘కథకళి’ రెండోసారి పోస్ట్ పోన్ అయింది. జాతీయ అవార్డు గ్రహీత పాండిరాజ్ దర్శకత్వంలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి జనవరి 14న విడుదల చెయ్యాలనుకున్న విషయం తెలిసిందే. అయితే తెలుగులో సంక్రాంతికి నాలుగు భారీ చిత్రాలు రిలీజ్ వుండడం వల్ల వాటి మధ్య ఒక డబ్బింగ్ సినిమాను రిలీజ్ చెయ్యడం కరెక్ట్ కాదని భావించిన విశాల్ జనవరి 22న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఈరోజు హైదరాబాద్‌కి యూనిట్‌తో సహా వచ్చిన విశాల్ ప్రెస్‌మీట్ కూడా పెట్టి 22న సినిమా రిలీజ్ అవుతోందని ఎనౌన్స్ చేశాడు. అయితే కొన్ని గంటల్లోనే మళ్ళీ సినిమాని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు విశాల్. సెన్సార్ ఇంకా పూర్తి కాకపోవడం వల్ల రిలీజ్‌ని వాయిదా వేస్తున్నామని, కొత్త రిలీజ్ డేట్‌ని త్వరలోనే ఎనౌన్స్ చేస్తామని విశాల్ చెప్పాడు.