హైదరాబాద్: రేప్ కేసులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అత్యాచార కేసులలో నేరస్థులు బాధితురాలితో కోర్టు బయట కుదుర్చుకునే రాజీలు చెల్లబోవని రూలింగ్ ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు ఒక రేప్ కేసు నిందితుడు బాధితురాలిని కలుసుకుని రాజీ కుదుర్చుకోవటానికివీలుగా బెయిల్ ఇవ్వటాన్ని సుప్రీమ్ కోర్టు అభిశంసించింది. అత్యాచార నిందితులపట్ల ఇలా వ్యవహరించటం అనైతికం, అక్రమం, అవాంఛనీయం అని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇది మహిళల గౌరవానికి వ్యతిరేకంగా ఉందని కూడా పేర్కొంది.
తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి కింద కోర్టు ఏడేళ్ళ శిక్ష విధించింది. శిక్ష పడిన నేరస్థుడు బెయిల్ కోసం హైకోర్టులో అప్పీల్ చేయగా బాధితురాలితో రాజీ కుదుర్చుకోవటానికి వీలుగా న్యాయమూర్తి అతనికి బెయిల్ మంజూరు చేశారు. దీనినే సుప్రీంకోర్ట్ అభిశంసించింది.