అక్రమ మైనింగ్ తో బాగా డబ్బు చేసిన గాలి జనార్ధన్ రెడ్డి వర్గం చెలరేగిపోతోంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే బాధ్యతను తీసుకున్న గాలి జనార్ధన్ రెడ్డి స్వయంగా ఎమ్మెల్యేలతో మాట్లాడి డీల్స్ సెట్ చేసుకుంటున్నారు. పలువురు ఎమ్మెల్యేలతో ఆయన ఒప్పందాలు గురించి మాట్లాడాు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేల డీల్స్ సెట్ చేశానని.. మరో ఎమ్మెల్యేకు వల వేస్తూ దొరికిపోయారు. ఆ ఆడియో టేప్ ఇప్పుడు సంచలనాత్మకయింది. గాలి జనార్ధన్ ెడ్డి ఎమ్మెల్యేలతో బేరం ఆడుతున్న ఆడియోను కాంగ్రెస్ నేత ఉగ్రప్ప మీడియాకు విడుదల చేశారు. రాయచూర్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బసన్నగౌడతో గాలి జనార్ధన్ రెడ్డి డీల్ గురించి మాట్లాడారు.
యాడ్యూరప్పకు మద్దతిస్తే లైఫ్ సెటిల్ చేస్తానని గాలి హామీ ఇచ్చారు. రాజీవ్గౌడ, శివన్నగౌడ లైఫ్ ఇప్పటికే సెటిల్ చేసేశానన్నారు. అయితే సదరు ఎమ్మెల్యే బసన్న గౌడ మాత్రం కాంగ్రెస్ పార్టీకి నమ్మక ద్రోహం చేయలేనని చెప్పుకొచ్చారు.
బీజేపీ అధిష్ఠానం సూచనతో మెజార్టీకి అవసరమైన సంఖ్యాబలాన్ని సమకూర్చే బాధ్యతను బళ్లారి బీజేపీ నేత గాలి జనార్దన రెడ్డి ఆయన సోదరులతో పాటు స్నేహితుడు బి.శ్రీరాములు స్వీకరించారు. రెండు రోజుల్లోగా శనివారం ఉదయం కల్లా మెజార్టీకి అవసరమైన కాం గ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతును కూడ గట్టాలని వీరిద్దరికీ సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. ఈ వాదనను బలపరిచేలా గాలి జనార్దన రెడ్డి, ఆయనకు సన్నిహితుడైన సుభాష్ ఐకార్ రంగంలోకి దిగారు. గౌరిబిదనూరు ఎమ్మెల్యే శివశంకర్ రెడ్డిని, పావగడ ఎమ్మెల్యే వెంకటరమణప్పతో కూడా మాట్లాడారు. బీజేపీకి సహకరిస్తే మంత్రి పదవితో అన్ని విధాలా చూసుకుంటామన్న హామీని ఇస్తు్నారు.
ఈ బేరసారాలకు సంబంధించిన రికార్డింగులు ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు ఇష్టం లేని రెండు పార్టీల్లోని 12 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని శ్రీరాములు బహిరంగంగానే చెబుతున్నారు. అంటే పన్నెండు మంది ఎమ్మెల్యేలను వీరు కొనుగోలు చేసినట్లు భావిస్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జికి ఏకంగా రూ. 500 కోట్లు ఇస్తూ వీడియోలతోసహా దొరికిపోయిన శ్రీరాములు ఇప్పుడు కూడా..అదే బాధ్యతల్లో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికి ఎవరి క్యాంపుల్లో వారు ఉన్నప్పటికీ.. రేపు బలపరీక్ష సమయానికి ఏం జరుగుతుందో అన్న టెన్షన్ పెరిగిపోతోంది.