గుజరాత్లో నిర్మిస్తున్న ధొలెరా నగరం గురించి… ఆంధ్రప్రదేశ్‌లో వివాదం నడుస్తున్న సమయంలోనే… గుజరాత్ ప్రభుత్వం మీడియాలో విస్తృతంగా ప్రకటనలు ఇచ్చింది. తెలుగు మీడియాతో పాటు ఇంగ్లిష్ పత్రికల్లోనూ ఈ ప్రకటనలు ఇచ్చాయి. ఆ ప్రకటనలు ధొలెరాను ప్రమోట్ చేయండ అనే కాన్సెప్ట్ కన్నా… వేరే ఉద్దేశంతో సిద్ధం చేసినట్లుగా ఉన్నాయి. కేంద్రం ఎన్ని నిధులిచ్చింది..? దాని పుట్టు పూర్వోత్తరాలేమిటి …? అన్న విషయాలను చెప్పడానికి ప్రాధాన్యమిచ్చింది.
ఈ ప్రకటనలు తెలుగుదేశం నేతలను మరింత ఆగ్రహానికి గురి చేశాయి. కానీ.. దేశం దృష్టికి తమ వాదన తీసుకెళ్లాడనికి ఈ ప్రకటనలను ఏపీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నేతలు ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యారు. ఏపీ ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు షార్ప్ గా .. ధొలెరా విషయంలో స్పందించారు. చాలా విషయాలు మీడియాకు వెల్లడించారు. ధొలేరా నగర నిర్మాణంపై తాను , సీఎం మాట్లాడాకే … దేశవ్యాప్తంగా అన్నిభాషల పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని యనమల రామకృష్ణుడు బయటపెట్టారు. ప్రకటనలకు ఖర్చు చేసినంత డబ్బు కూడా ఏపీ రాజధానికి ఎందుకు నిధులు ఇవ్వలేదన్నారు.. ఢిల్లీ-ముంబై కారిడార్‌లో ధొలేరా భాగమని ప్రభుత్వ పెద్దలే చెప్పారని… వేలకోట్లు నిధులు ఇస్తున్నట్లు పరోక్షంగా వెల్లడించారని యనమల తేల్చారు. కానీ వైజాగ్-చెన్నై, బెంగళూరు-చెన్నై కారిడార్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వ లేదన్నారు.
ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు కూడా విడిగా ధొలెరాపై స్పందించారు. కేంద్రం ఓ ట్రస్ట్ ద్వారా రూ.17 వేల కోట్లు బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఖర్చు చేస్తోందన్నారు. జీవీఎల్ చెప్పినట్లు.. కృష్ణపట్నానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. ధొలెరాపై నిజాలు చెబుతామనో.. లేక… ప్రమోట్ చేసుకుందామనో.. లేక నిధులు ఇస్తున్నారు.. ఏం చేసుకుంటారో..చేసుకోమనో.. చెప్పేందుకు… గుజరాత్ ప్రభుత్వం వంద కోట్లకుపైగా ఖర్చు పెట్టి ప్రకటనలు ఇచ్చి ప్రచారం చేస్తోంది. కానీ ఈ ధొలెరాను చూపించి..అమరావతిపై కేంద్రం చూపిస్తున్న నిరాదరణను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ సిద్దమయింది. అమరావతి- ధొలెరాను పోల్చి.. దేశ ప్రజల ముందుకు … ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశం దృష్టిలో పడేలా చేయాలని టీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు. దీంతో మరికొద్ది రోజుల పాటు ఈ ధొలేరా మీడియాలో హైలెట్ కానుంది.