ప్రపంచానిది ఓ దారైతే వర్మది మరోదారి. ఆయన శిష్యూలూ అంతే. ‘నలుగురికీ నచ్చినది నాకసలే నచ్చదురోయ్’ అని పాడుకుంటుంటుంటారు. శ్రీరెడ్డి కూడా ఇదే పాట పాడుతోంది. వర్మ – నాగార్జునల కలయికలో వచ్చిన ‘ఆఫీసర్’ అదుర్స్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. సినిమాచాలా బాగుందని, ఈ సినిమాపై రాజకీయాలు చేయొద్దని గట్టిగా చెప్పింది. అక్కడితో ఆగలేదు. ‘మీ సినిమాలొస్తాయి కదా.. చూసుకుందాం’ అంటూ తొడగొట్టింది. శ్రీరెడ్డి కామెంట్లు చూస్తుంటే.. ఆఫీసర్ సినిమాని ఓ వర్గం కావాలని తొక్కేయాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. నిజంగా ఈ మాటంటే… జనాలు నవ్వుతారు. వర్మ వీరాభిమానులు, అక్కినేని వంశాభిమానులు కూడా ‘మా పరువు పోయింది’ అన్నట్టు తలలు దించుకుంటున్నారు. ఆపీసర్ సినిమా వసూళ్లు, దానికొచ్చిన టాక్, సమీక్షలు చూస్తే… `ఆఫీసర్` పరిస్థితి అర్థమవుతుంది. ఈ సినిమా సోమవారం వరకూ కూడా నిలబడేలా లేదు. మధ్యలోనే థియేటర్లలో ఎత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. వర్మపై అభిమానం కొద్దో.. రివర్స్‌లో మాట్లాడితే జనం దృష్టిలో పడతామనే పిచ్చితోనో సినిమాని వెనకేసుకురావొచ్చు. కాకపోతే.. ‘మరెవరో తొక్కేస్తున్నారు’ అనే రేంజులో స్పీచులిస్తే.. జనాలు నవ్వుతారు. తన ఇష్యూలో రాంగోపాల్ వర్మ కాస్త సపోర్టింగ్‌గా మాట్లాడాడని… శ్రీరెడ్డి ఇలా రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తోందే తప్ప… ‘ఆఫీసర్’కి అంత సీన్ లేదన్నది అందరికీ తెలుసు. ఈ విషయం శ్రీరెడ్డి కూడా తెలుసుకుంటే మంచిది.