జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారా..? మళ్లీ తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టడానికి సిద్ధమవుతున్నారా..? మారుతున్న రాజకీయ పరిణామాలతో ఆయన ఇక నిర్ణయం తీసుకోబోతున్నారా..?.. అంటే అవుననే అంటున్నాయి.. జాతీయ మీడియా సంస్థలు. న్యూస్ 18 ఇంగ్లిష్ వెబ్ సైట్ ఈ మేరకు ఓ కథనం ప్రచురించింది. నిన్నామొన్నటి వరకూ.. తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ తో… పవన్ కల్యాణ్ సన్నిహిత సంబంధాలు కొనసాగించారని.. ఎపీ ఎన్నికల్లో కేసీఆర్ తనకు మద్దతిస్తారని.. ఆయన ఆశించారని.. కానీ అనూహ్యంగా .. జగన్ కే.. కేసీఆర్ మద్దతు పలకడంతో… పవన్ హర్టయ్యారని ఆ కథనం విశ్లేషించింది. అంతే కాదు.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయడం అంటే… రిస్క్ తో కూడుకున్న వ్యవహారంగా పవన్ భావిస్తున్నారని.. జాతీయ మీడియా చెబుతోంది.
కేసీఆర్ – జగన్ కలయిక వల్లనే… పవన్ కల్యాణ్ .. తెలుగుదేశం పార్టీ మళ్లీ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్.. వీరిద్దరూ.. కలవడంపై విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబుపై కసితోనే.. జగన్.. కేసీఆర్ తో కలుస్తున్నారని .. విమర్శలు గుప్పించారు. ఇదే కాదు.. అంతకు ముందు నుంచి పవన్ కల్యాణ్ స్ట్రాటజీ మారుతూ వస్తోంది. క్రిస్మస్ పండుగకు యూరప్ వెళ్లి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్ పూర్తిగా సైలెంటయిపోయారు. జిల్లాల వారీగా సమీక్షలు చేస్తున్న సమయంలో.. జగన్ పై విమర్శలు గుప్పించారు కానీ చంద్రబాబును విమర్శించలేదు. అదే సమయంలో చంద్రబాబుకు అనుకూలంగా ప్రకటనలు చేయడం ప్రారంభించారు. అదే సమయంలో.. జగన్ తో పొత్తుల కోసం టీఆర్ఎస్ నేతలు రాయబారం నడుపుతున్నారని కూడా ప్రకటించిన సంచలనం రేపారు.
అంతకు కొద్ది రోజుల ముందు… జనసేన టీడీపీతో కలిస్తే తప్పేమిటన్న చంద్రబాబు వ్యాఖ్యలతో ఓ రాజకీయ దుమారం రేగింది. రెండురోజుల పాటు ఈ వ్యాఖ్యలపై సైలెంట్ గా ఉన్న పవన్ కల్యాణ్.. ఆ తర్వాత ఎవరితోనూ పొత్తు ఉండదని ప్రకటించారు. కమ్యూనిస్టు పార్టీలతో మాత్రమే పొత్తులుంటాయని ప్రకటించారు. వారితో … సీట్ల సర్దుబాటు చర్చలు కూడా ప్రారంభించారు. అయితే అనూహ్యంగా.. జగన్, కేసీఆర్ మధ్య బంధం బలపడటంతో… ఆ కూటమిపై విమర్శలు ప్రారంభించారు. చంద్రబాబుపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇలా వరుసగా జరుగుతున్న పరిణామాలతో… జాతీయ మీడియా కూడా.. పవన్ కల్యాణ్.. చంద్రబాబు వైపు వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. జాతీయ మీడియా ఈ విషయంలో నమ్మకంతో ఉంది. మరి పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో..?