అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను.. రిపీట్ చేస్తామని… తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల్లో లభించిన విజయంతో వారి కాన్ఫిడెన్స్ ఆ స్థాయిలో ఉంది. ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో మాత్రమే… టీఆర్ఎస్ కొంత వెనుకబడింది. ఈ సారి ఆ నియోజకవర్గాల్లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. అందుకు తగ్గ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే… కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం.. ఇప్పటికీ.. ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈవీఎంల వల్లే తమకు ఆ ఫలితాలొచ్చాయంటున్నారు. ఈ వాదనలో ఎంత నిజం ఉందో కానీ… ఈసీ మాత్రం ఓ షాక్ లాంటి వార్త చెప్పుకొచ్చింది. అదేమిటంటే… పార్లమెంట్ ఎన్నికల్లోనూ.. ఈవీఎంలే వాడతారట…! ఎక్కడైనా ఈవీఎంలే వాడతారు.. కానీ పార్లమెంట్లో వాడేది… అసెంబ్లీ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలట..!
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న రజత్‌కుమార్.. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మరింత సమర్థంగా పని చేయాలనుకుంటున్నారు. అందుకే… ఎన్నికల ఏర్పాట్ల గురించి సమీక్ష నిర్వహించారు. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అసలు విషయం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు వాడిన ఈవీఎంలనే పార్లమెంట్ ఎన్నికలకు వాడబోతున్నట్లు ప్రకటించారు. రజత్ కుమార్ ప్రకటన… కలకలం రేపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే..ఇప్పటికే ఈవీఎంల విషయంలో… విపక్ష పార్టీలు చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కాదు.
గ్రేటర్ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలే… అసెంబ్లీ ఎన్నికల్లో వాడారాని…కాంగ్రెస్ నేతలు సెటైరికల్ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో వాడిన ఈవీఎంలే పార్లమెంట్ ఎన్నికల్లో వాడబోతున్నారని… ఈసీ అధికారికంగా ప్రకటించడంతో వారు సైలెంట్‌గా ఉండే అవకాశం లేదు. దీన్నో ఇష్యూ చేయడం ఖాయమే. అయితే.. రాజకీయ పార్టీల అభ్యంతరాలను ఈసీ పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి… ఊరికే.. ఓ వివాదం అవడానికి తప్ప… మరో ఉపయోగం ఉండదు.