ఎప్పుడు వచ్చాం అన్నది కాదన్నయ్యా..బుల్లెట్ దిగిందా? లేదా అన్నది పాయింట్ అంటాడు మహేష్ బాబు తన పోకిరి సినిమాలో. వైకాపా నేత వైఎస్ జగన్ ఈ డైలాగు తెలుసుకోవాలి. లేదా పోకిరి సినిమా చూడాలి.
ఎందుకంటే, పాపం ఆయన నవరత్నాలను చంద్రబాబు కాపీ కొట్టేస్తున్నారంటూ కిందా మీదా అయిపోతున్నారు. పింఛన్ పెంచేసారు. రైతు బంధు లాంటి స్కీమ్ ను కాపీ కొట్టేస్తున్నారు. ఇంకా..ఇంకా..అంటూ.
నిజమే కావచ్చు. గతంలో చాలా మంది ఇలాంటి వ్యవహారాలు చేసారు. అయిడియా మీదే కావచ్చు. ఇంప్లిమెంటేషన్ మాది అనే టైపు అన్నమాట. జనం కూడా ఇదే చూస్తారు. నువ్వు చెప్పావు సర్లేవయ్యా..నువ్వు రావాలి. ఇవ్వాలి. అది రేపటి మాట. కానీ ఆయన ఇప్పుడే ఇచ్చేస్తున్నాడు కదా? అంటారు జనం.
ఇది మాత్రం జగన్ కు తెలుసు. అందుకే అంత ఆందోళన చెందుతూ, తన అయిడియాలే ఇవి అని చెప్పడానికి చూస్తున్నారు. కానీ దాని వల్ల ఫలితం అంతంత మాత్రం. ఇకపై రాజకీయ నాయకులు కూడా తమ హామీలు ఎన్నికల కోడ్ వచ్చేవరకు సినిమా స్క్రిప్ట్ లు దాచుకున్నట్లు దాచుకోవాలి. లేదంటే బుల్లెట్ దిగిపోతుంది.