దేశంలో రాజకీయ పరిణామాలు ఒక్క సారిగా మారిపోవడానికి 2018 ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్లో బీజం పడంది. ఆ రోజున… కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వానికి అదే పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో.. మూడేళ్ల పాటు విభజన హామీలు, నిధులు ఇస్తారేమోనని టీడీపీకి…
ఊపిరి బిగపట్టి చూసింది. కానీ.. ఆంధ్రప్రదేశ్ అనే ప్రస్తావన లేకుండానే.. జైట్లీ బడ్జెట్ ప్రసంగం నడిచిపోవడంతో… ఏపీ ఊసూరుమంది. టీడీపీ పోరుబాట పట్టింది. ఆ సమావేశాలు రెండో విడత భేటీలో.. టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. అప్పట్నుంచి రాజకీయంగా ఏపీలో అనూహ్యమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ఫిబ్రవరి ఒకటో తేదీ వచ్చింది.
కేంద్ర ప్రభుత్వానికి ఈ సారి పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టే అవకాశం లేదు. కేవలం ఓటాన్ అకౌంట్ మాత్రం పెట్టాలి. అంటే.. ఎన్నికలయ్యే వరకూ పద్దులను మాత్రమే పెట్టాలి. ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ పెడుతుంది. సాధారణంగా ఓటాన్ అకౌంట్‌ను.. ప్రభుత్వాలు దుర్వినియోగం చేయవు. జనాకర్షక పథకాలు ప్రకటించడానికి సాహసించవు. కానీ ఈ సారి మోడీ ప్రభుత్వం అలాంటి వాటిని పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఏకంగా రాజ్యాంగ సూత్రాలు, సంప్రదాయాలకు వ్యతిరేకంగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా… ఏపీకి రావాల్సిన ప్రయోజనాల విషయంలో.. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు.. చంద్రబాబు.. వినూత్న ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా.. ఏపీలోనే సెంటిమెంట్ పెంచబోతున్నారు. దీనికి.. విపక్షాలు, ప్రజాసంఘాలు ఇచ్చిన బంద్ పిలుపును కూడా ఉపయోగించుకుంటున్నారు.
ఇప్పటికే వామపక్షాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దాదాపుగా అన్ని పక్షాలు మద్దతు తెలిపాయి. టీడీపీ కూడా సంఘిభావం ప్రకటించింది. అయితే ఈ నిరసనలను.. తామే ఏ రేంజ్‌కు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. అంటే.. ఓ రకంగా హైజాక్ చేయబోతోంది. ఒకటో తేదీన ఏపీ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వబోతోంది. బ్లాక్‌డేగా ప్రకటించి.. నిరసనలు చేయాలనే వ్యూహాన్ని అమలు చేయబోతున్నారు. సహజంగానే.. ఏపీకి కేంద్రం ఇచ్చేదేమీ ఉండదు. ఇంత కాలం ఇవ్వనిది.. ఇప్పుడు ఇస్తుదంన్న గ్యారంటీ కూడాలేదు కాబట్టి… టీడీపీ బ్లాక్డే్కు పక్కా ఏర్పాట్లు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.