ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ముంబైలోని ఓ ఆసుపత్రిలో ఆయనకు ఆపరేషన్ జరిగింది. అప్పటి నుంచీ బ్రహ్మానందం ఆరోగ్య పరిస్థితి గురించి చిలవలు పలవలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? అనే ఆత్రుత ఆయన అభిమానులకు, సినీ పరిశ్రమకు ఎక్కువ అవుతోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… బ్రహ్మానందం ఆరోగ్యం ప్రస్తుతం కుదుటగానే ఉంది. ఆయన ఇప్పుడు ముంబైలోనే ఉన్నారు. ఆపరేషన్ తరవాత వైద్యులు కనీసం 20 రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించార్ట. ఆపరేషన్ పూర్తయ్యాక ఆయన హైదరాబాద్ రావొచ్చు. కాకపోతే ముంబై వైద్యులకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఆయన.. ఆసుపత్రికి దగ్గరలోనే ఉంటున్నారని, త్వరలోనే హైదరాబాద్ తిరిగివచ్చేస్తారని సమాచారం.