రాజకీయాల్లో ఉన్నప్పుడు.. ఓ స్పష్టమైన విధానం ఉండాలి. కీలకమైన అంశాల్లో .. ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంటే.. అటూ ఇటూ కాకుండా పోయే పరిస్థితి ఉంటుంది. తెలంగాణ ఇష్యూ లాంటి అంశాల్లో.. టీడీపీ ఎటూ తేల్చుకోలేక.. మొత్తానికే ఓ చోట పార్టీని కోల్పోయింది. కానీ.. పెద్దగా క్లిష్టమైన సమస్య కాని.. కేంద్రంపై పోరాటం విషయంలో.. ఏటూ తేల్చుకోలేకపోతే.. అది చేతకాని రాజకీయమే అవుతుంది. ఏపీలో ఇప్పుడు వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఇదే రాజకీయం చేస్తున్నారు. నిజంగా.. ఏపీకి మోడీ అన్యాయం చేశారని వారు అనుకుంటే.. మోడీ పర్యటనపై వారు కచ్చితంగా స్పందించి ఉండేవారు. ఏపీకి అన్యాయం జరిగిందంటారు కానీ.. ఏపీకి మోడీ వస్తే.. ఉలుకూ పలుకూ లేరు.
బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ విషయంలో మరో మాట లేదు. కానీ వారిద్దరూ… మోడీ అన్యాయం చేశారని నేరుగా చెప్పేలని పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడే వస్తోంది అసలు సమస్య. అలాంటప్పుడు.. కచ్చితంగా.. మోడీ అన్యాయం చేయలేదని.. ఎదురుదాడి ప్రారంభించాలి. కానీ అలా చేయకుండా.. మోడీ మోసం చేశారని.. చెప్పుకొస్తూ.. ఆయనపై పోరాటం చేసి.. తమ చిత్తశుద్ధిని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితుల్లో.. సైలెంట్‌గా ఉండి పోవడంతో… నిజంగా ప్రజాసమస్యలపై పోరాడే చిత్తశుద్ధి వారికి లేదన్న విషయంలో తటస్థుల్లో క్లారిటీ వచ్చేసినట్లయింది. రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైనది తటస్థుల ఓట్లే. మద్దతు దారులు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. వారిని కాపాడుకుంటూనే తటస్థుల ఓట్లు పొందాలి. వారు… ఇలా.. దాక్కునే రాజకీయాలు చేసే వారికి ఎప్పుడూ ఓట్లేయరు.
నాలుగేళ్ల పాటు చంద్రబాబు బీజేపీతో సంసారం చేశారు.. ఇప్పుడే.. పోరాడుతున్నారని.. వైసీపీ, జనసేన కామన్‌గా ఓ వాయిస్ వినిపిస్తున్నాయి కానీ.. ఓట్లు వేయడానికి.. చరిత్ర ఎవరూ చూడరు. ఇప్పుడేం జరుగుతుంది..? భవిష్యత్‌లో ఏం జరుగుతుంది..? ఎవరికి ఓటు వేస్తే మేలు జరుగుతుంది.. అన్నదే చూస్తారు. చంద్రబాబు నాలుగేళ్లు బీజేపీతో ఉన్న మాట నిజమే… కానీ… ఆ పార్టీతో ఏమి కావడం లేదనే కదా.. బయటకు వచ్చింది. మరి .. చంద్రబాబు.. బీజేపీతో కలిసి ఉన్నప్పుడు.. ఆ పార్టీపై పోరాడి.. టీడీపీ బయటకు రాగానే.. ఎందుకు సైలెంటయ్యారు…? ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలి కదా..! వైసీపీ, జనసేన.. రెండూ.. బీజేపీకి బీ టీంగా.. ఇప్పుడు.. ప్రత్యేకంగా టీడీపీ ప్రచారం చేయాల్సిన పని లేదు. రేపు విభజన హామీలే ఎజెండాగా ఓటింగ్ జరిగితే… అసలు ఇవ్వనే ఇవ్వబోమంటున్న బీజేపీకి.. వారి బీటీంగా ముద్ర పడిన వారికి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారు..? ఈ చిన్న లాజిక్ జగన్, పవన్ ఎలా మిస్సయ్యారు..?