తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. ఈ సారి అభ్యర్థుల ప్రకటన ముందుగానే చేయాలని నిర్ణయించుకుది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అభ్యర్థుల ప్రకటన అలస్యమవడమేననే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమయింది. పార్లమెంట్ ఎన్నికలో అభ్యర్థుల ప్రకటనను ఆలస్యం చేయవద్దనే నిర్ణయానికి హైకమాండ్ వచ్చినట్లు తెలుస్తుంది 14వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకుని.. ఆ తర్వాత వాటిని వెంటనే స్క్రూటినీ చేయబోతున్నారు. ఇప్పటివరకు 150 కి పైగా దరఖాస్తులు వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ దరఖాస్తులను తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ ఈ నెల 17 న పరిశీలించి అందులో పోటీ చేయడానికి అర్హత ఉన్న వారి దరఖాస్తులను హైకమాండ్ కు 25 వ తేదీలోపు పంపిస్తారు. చివరి వారంలో అభ్యర్థుల ప్రకటనను హైకమాండ్ చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పుతున్నాయి
పార్లమెంట్ ఎన్నికలో సానుకూల ఫలితాలు వచ్చే విధంగా పార్టీ కసరత్తు చేస్తుంది.ఇక అందులో భాగంగా ఈ నెల 15 నుండి 17 వరకు మూడు రోజుల పాటు పార్లమెంట్ నియోజకవర్గల వారిగా సమీక్ష సమావేశాలను పార్టీ నిర్వహించనుంది. పార్లమెంట్ సమీక్ష సమావేశాల్లో ఏ ఏ నియోజకవర్గలో ఎవరు అభ్యర్థులుగా ఉంటే బాగుంటుందనే అభిప్రాయలను సేకరించనునట్లు సమాచారం. పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ కి కాంగ్రెస్ కు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ప్రజాలోకి తీసుకవేళ్ళాలనే అభిప్రాయన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మోడీ ప్రధానిగా ఉండి ఏమి చేయలేకపోయారనే భావనను ప్రజాలోకి తీసుకెళ్తే పార్టీకి కలిసివస్తుందని,ఎన్నికలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని అసమర్ధ ప్రధానిగా ఎండగట్టడం వల్ల పార్టీకి సానుకూల ఫలితాలు వస్తాయని హస్తం పార్టీ స్కెచ్ వేస్తుంది.మోడీ ప్రధాని అయినా తర్వాత దేశ ప్రగతి దిగజారిపోయిందని విమర్శలు చేయలనుకుంటుంది. రాహుల్ గాంధీ ప్రధాని అయితే నిరుద్యోగ సమస్యలను,రైతు సమస్యలను పరిష్కరిస్తారని ఆ వర్గాలు హామీ ఇస్తూ పార్లమెంట్ ఎన్నికలో ఓటు బ్యాంకు ను కొల్లగొట్టాలని కాంగ్రెస్ ప్లాన్ వేస్తుంది.
రాష్ట్రం నుండి అధిక సంఖ్యలో టి ఆర్ ఎస్ ఎంపీ లు ఉన్న విభజన చట్టం హామీలను నెరవేర్చడంలో విఫలమైందనే విమర్శలు చేస్తూ ప్రజాలోకి తీసుకువెళ్లి టి ఆర్ ఎస్ కు ఓట్లు పడకుండా స్కెచ్ వేస్తుంది.మరో వైపు అభ్యర్థుల ప్రకటనను తొందరగా చేసుకుంటూ, బీజేపీ ని విమర్శించడం వల్ల తమకు పార్లమెంట్ ఎన్నికలో రాష్ట్రంలో సానుకూల ఫలితాలు వస్తాయని హస్తం పార్టీ లెక్కలు కడుతుంది. కానీ ప్రతి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇలానే చెబుతుంది. చివరికి.. టిక్కెట్ల విషయం నామినేషన్ల గడువు వరకూ తేల్చుకోలేరు.