పైరసీ వల్ల తెలుగు సినిమా ఎంత నష్టపోతోందో నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు. ‘కిల్ పైరసీ’ అంటూ ఉద్యమాలు చేస్తున్నారు. పైరసీ చేసినవాళ్లని సినిమా ద్రోహులుగా చూస్తున్నారు. ఓ సినిమాలో మాత్రం `పైరసీ ద్రోహి`ని సైతం హీరోగా చూడాల్సిందే. ఆ సినిమానే `హీరో – హీరోయిన్`. నవీన్ చంద్ర, గాయత్రీ సురేష్ జంటగా నటించారు. ఇందులో హీరో కొత్త సినిమాల్ని పైరసీ చేస్తూ బతికేస్తుంటాడు. హీరోయిన్ ఏమో ఓ నిర్మాత కూతురు. ఇద్దరూ ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్నది ఈ సినిమా కథ. `ఏ పైరెటెడ్ లవ్ స్టోరీ` అంటూ విచిత్రమైన క్యాప్షన్ కూడా పెట్టారు. జి.ఎస్.కార్తీక్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. టీజర్ విడుదలైంది. హీరో యాటిట్యూడ్, క్యారెక్టర్ చుట్టూ టీజర్‌ని డిజైన్ చేశారు. సినిమాలు, పైరసీలు… వీటి చుట్టూ కథ తిరగబోతోందని టీజర్ చూస్తే అర్థమైంది. ప్రతీ మగాడూ ప్లే బాయే, ఛాన్స్ దొరికితే మేం కుక్కలమే.. తమిళ రాకర్స్ జిందాబాద్ (తమిళ సినిమాల్ని పైరసీ చేసే ముఠా) అనే డైలాగులు ఉన్నాయిందులో.