వరుణ్‌తేజ్ హీరోగా `అప్పట్లో ఒకడుండేవాడు` దర్శకుడు సాగర్ చంద్రతో 14 రీల్స్ ప్లస్ ప్రొడక్షన్ హౌస్ ఒక సినిమా ప్లాన్ చేసింది. చివరకు పట్టాలు ఎక్కలేదు. సాగర్ చంద్ర ప్లేస్‌లో హరీష్ శంకర్‌కి అవకాశం ఇచ్చారు. వరుణ్‌తేజ్ హీరోగా హరీష్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ `వాల్మీకి` మొదలైంది. దాంతో నిరాశగా 14 రీల్స్ ప్లస్ నుంచి బయటకొచ్చిన సాగర్ చంద్ర స్రవంతి మూవీస్‌లో అడుగుపెట్టాడు. వరుణ్‌తేజ్ వద్దన్న కథను రామ్‌కి చెప్పాడట! అప్పటికే కథపై కొన్ని నెలలు వర్క్ చేసి వుండటంతో స్క్రిప్ట్ పక్కాగా వుంది. రామ్, స్రవంతి రవికిశోర్ ఇద్దరికీ కథ నచ్చడంతో దర్శకుడికి హామీ ఇచ్చేశారు. ఇప్పుడు రామ్ `ఇస్మార్ట్ శంకర్` చేస్తున్నాడు. మే నెలలో విడుదల చేయాలనే టార్గెట్‌తో రామ్, దర్శకుడు పూరి షూటింగ్ చేస్తున్నారు. రెండు నెలల్లో సినిమా పూర్తవుతుంది. వెంటనే సాగర్ చంద్ర సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని రామ్ ప్లానింగ్.