ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు చేపట్టిన..అన్నదాత సుఖీభవ పథకంతో .. ఎలాంటి నిబంధనలు అడ్డు పడకుండా… ప్రతి రైతు కుటుంబానికి రూ. పది వేలు అందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కౌలు రైతులకూ.. ఈ పథకాన్ని వర్తింప చేస్తుంది. దీనికి పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. రైతుల చేతికి ఈ నెలాఖరులోనే చెక్కులు అందేలా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ కిసాన్ సమ్మాన్, రాష్ట్ర ప్రభుత్వ అన్నదాత సుఖీభవ పథకాన్ని కలిపేస్తారు. కేంద్రం.. మూడు విడతలుగా ఆరు వేలు ఇస్తామంటోంది. కానీ.. ఏపీ ప్రభుత్వం మాత్రం… రెండు విడతలుగా రూ. పది వేలు ఇవ్వనుంది. ఐదు ఎకరాలు దాటిన వారికి కేంద్రం సాయం చేయదు. కానీ ఏపీ ప్రభుత్వం అందిరికీ ఇస్తుంది. ఈ సొమ్ము పూర్తిగా ఏపీ ప్రభుత్వమే చెల్లిస్తుంది.
అన్నదాత సుఖీభవం పథకం పొందే రైతుల సంఖ్య 69 లక్షలు
54 లక్షల మంది ఐదు ఎకరాలలోపు రైతులు
15 లక్షల మంది ఐదు ఎకరాలు దాటిన రైతులు
అదనంగా 15లక్షల మందికిపైగా కౌలు రైతులకు సాయం
అన్నదాత సుఖీభవ ద్వారా పంపిణీ : రూ. 7,621 కోట్లు
వచ్చే రెండు నెలల్లో తుది విడదల రుణమాఫీ నిధులు
మార్చి, ఏప్రిల్‌తో రుణమాఫీకి రూ. 8వేల కోట్లు విడుదల
మొత్తంగా రైతుల ఖాతాలకు రూ. 13వేల కోట్ల నగదు బదిలీ
రైతులకు పెట్టుబడి సాయం కింద.. ప్రభుత్వం అందించాలనుకున్న సాయానికి.. ఎన్నికల నిబంధనలు అడ్డు రాకుండా… జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందుగానే రైతులకు చెక్కులు పంపిణీ చేయబోతున్నారు. ఇప్పటికే వివిధ రూపాల్లో రాష్ట్రం వద్ద.. రైతులకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంది. కౌలు రైతుల విషయంలో మాత్రం… సీజన్ల వారీగా లెక్కలు తీసుకోవాలి. ఖరీఫ్ ప్రారంభమయ్యేటప్పటికి.. అప్పటికప్పుడు లెక్కలు తీసుకుని.. సాయం చేస్తారు. ఓ విధంగా.. నేరుగా.. చంద్రబాబు కౌలు రైతులతో కలిపి.. నేరుగా… 80 లక్షల కుటుంబాలకు సాయం అందేలా ఈ ప్రణాళిక సిద్ధం చేశారు. పకడ్బందీగా అమలు చేయనున్నారు.