తెలుగుదేశం పార్టీ ఎంపీ అవంతి శ్రీనివాస్ ఈరోజు వైయస్ జగన్ తో భేటీ అయ్యారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ అంటే కొంతమందికి గుర్తుకు వస్తుందో రాదో తెలియదు కానీ, “జోన్ లేదు గీన్ లేదు” అంటూ వ్యాఖ్యలు చేసి వీడియో సాక్షిగా అడ్డంగా బుక్ అయిన ఎంపీ అంటే మాత్రం చాలామందికి ఇట్టే గుర్తుకు వస్తుంది. ఆ మధ్య రైల్వే జోన్ మీద ప్రత్యేక హోదా మీద తెలుగుదేశం పార్టీ నాయకులు పిచ్చి మాటలు మాట్లాడుతున్న ఒక వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. టీడీపీ ఎంపీ మురళీమోహన్, నేనుు కూడాప్రత్యేక హోదా అంటూ నిరాహార దీక్ష చేస్తాను నాకు ఐదు కేజీలు తగ్గాలని ఉంది అంటూ వెటకారంగా మాట్లాడితే, దానికిి ఎంపీ అవంతి శ్రీనివాస్, “జోన్ లేదు గీన్ లేదు” అంటూ రైల్వేజోన్ సమస్యను వెటకారం చేస్తూ మాట్లాడారు.
Click here:
ఇప్పుడు ఆ ఎంపీ అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్ సిపి లోకి వెళ్ళడానికి సిద్ధమైపోయారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ తో ఇవాళ భేటీ అయ్యారు. ముఖ్యంగా భీమిలి స్థానం నుంచి పోటీ చేయడానికి అవంతి శ్రీనివాస్ ఆసక్తిగా ఉన్నట్లు, భీమిలి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి జగన్ సుముఖంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అవంతి శ్రీనివాస్ 2009 నుంచి 2014 వరకు భీమిలి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకవేళ వైఎస్సార్సీపీ తరఫున ఇప్పుడు భీమిలి ఎమ్మెల్యే గా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ తరపున ఆ స్థానం నుండి పోటీ పడే గంటా శ్రీనివాసరావు తో తలపడాల్సి ఉంటుంది. అలాగే భీమిలి నియోజకవర్గం సామాజిక సమీకరణాలు జనసేన పార్టీకి కూడా అనుకూలంగా ఉన్నాయి. గతంలో ఇదే అవంతి శ్రీనివాసరావు పీఆర్పీ తరఫున ఈ స్థానం నుండి గెలుపొందారు.
మరి వైఎస్ఆర్ సిపి తరపున నిజంగానే అవంతి శ్రీనివాస్ కి టికెట్ వస్తుందా, ప్రజలు విశాల హృదయులు కాబట్టి గతంలో చేసిన ” జోన్ లేదు గీన్ లేదు” లాంటి వ్యాఖ్యలను మరచిపోయి ఈయనకు మళ్లీ ఓటు వేస్తారా అన్నది వేచి చూడాలి.