‘ఏం రెడ్డీ..మనదే ఊరు’ అంటూ ఎన్టీఆర్ సరసన అరవింద సమేత సినిమా డైలాగ్ కొట్టి, టిక్ టాక్ లాంటి ఆప్స్ లో తెగ వైరల్ కావడానికి కారణమైంది హీరొయిన్ పూజా హెగ్డే. అంతకు ముందు బన్నీని డిజె లో కూడా తెగ కవ్వించేసింది. అదే టైమ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ తో, లేటెస్ట్ గా మహేష్ సరసన కూడా చాన్స్ లు పట్టేసింది.
ఇప్పడు మళ్లీ బన్నీతోనే మరో సినిమా చేసేయబోతోంది. త్రివిక్రమ్-బన్నీ సినిమాలో పూజ ఎంట్రీ దాదాపు ఖాయమైనట్లే. దర్శకుడు త్రివిక్రమ్ తన ఛాయిస్ పూజనే అని చెప్పేయడంతో దాదాపు అదే పక్కా అయిపోయినట్లు తెలుస్తోంది. పూజ కళ్లల్లో, ఫేస్ లో ఇటు ఫన్ అటు కవ్వింపు భలేగా పలుకుతాయి. బహుశా అందుకే కావచ్చు, త్రివిక్రమ్ మళ్లీ ఆమెనే తన సినిమాకు కావాలనుకుంటున్నట్లుంది.
వాస్తవానికి బన్నీ లాంటి టాప్ హీరో షార్ట్ టైమ్ లో హీరోయిన్ ను రిపీట్ చేయడం అరుదుగా జరుగుతుంటుంది. కానీ త్రివిక్రల్ లాంటి డైరక్టర్ తలుచుకుంటే అదే పెద్ద కష్టం కాదు. రంగస్థలంలో జిగేల్ రాణి అంటూ చిందులేసిన పూజ, ఆ విధంగా మరోసారి బన్నీ పక్కన జిగేల్ మన మెరవబోతోంది.