మహానాయకుడు సెన్సార్ పూర్తయింది. ఈసారి కూడా క్లీన్ యూ సర్టిఫికెట్ లభించింది. సూటిగా సుత్తి లేకుండా ఎక్కడా బోర్ కొట్టించకుండా.. సినిమాని కట్ చేశాడు క్రిష్. ఈసారి నిడివి 128 నిమిషాలే. అంటే 2 గంటల 8 నిమిషాలు. అందులో కనీసం 5 నిమిషాలు టైటిల్ కార్డుకే సరిపోతుంది. తొలి భాగం డిజాస్టర్ అవ్వడంతో ఈసారి ఎడిటింగ్ టేబుల్ దగ్గర క్రిష్ కాస్త గట్టిగానే కష్టపడినట్టు తెలుస్తోంది. ఎమోషన్స్ క్యారీ అయ్యేలా జాగ్రత్త పడ్డాడని, అనవసరమైన సన్నివేశాలు లేకుండా చూసుకున్నాడని, అందుకే సినిమా రెండు గంటల్లోనే ముగిసిందని తెలుస్తోంది. కథానాయకుడు రిజల్ట్ తరవాత చిత్రబృందం అప్రమత్తమైంది. కొన్ని కీలకమైన సన్నివేశాల్ని రీషూట్ చేసింది. ల్యాగ్ తగ్గించడానికి కొన్ని సన్నివేశాల్ని మళ్లీ తెరకెక్కించారు. మహానాయకుడు పూర్తిగా ఎమోషన్పై ఆధారపడిన సినిమా. ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానంలో ఒడిదుడుకుల్ని, అంతిమ ఘడియల్ని చాలా భావోద్వేగ భరితంగా తెరకెక్కించాడట .