పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభలో జగన్ బీసీ జన వాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్‌లు కాదు, భారత దేశ కల్చర్‌ను నిలబెట్టిన గొప్పవారు, వెనుకబడ్డ కులాలు కాదు, మన జాతికి వెన్నుముకలు అని అన్నారు జగన్. ప్రతి బీసీ సోదరుడి ముఖంలో చిరునవ్వు కలిగేలా చేయడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు జగన్.
అయితే జగన్ బీసీ గర్జన మీద ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. వైకాపా కి రాష్ట్ర శాసనసభ లో ఉన్న బలం మేరకు రెండు సార్లు రాజ్యసభ కు తమ పార్టీ నాయకుల నుంచి పంపే అవకాశం వస్తే, రెండు సార్లు కూడా తమ సొంత సామాజిక వర్గానికి చెందిన నేతల నే జగన్ సూచించారు.
Click here:
https://www.telugu360.com/rajya-sabha-nominations-caste-equations-telugu-states-part1/amp
అదే విధంగా, ప్రతి పక్షానికి ఉండే ఏకైక పదవి పిఏసి కమిటీ ని కూడా తమ సొంత సామాజిక వర్గానికి చెందిన నేత కే ఇచ్చిన విషయం తెలిసిందే. పిఏసి పదవి ని తమ సొంత సామాజిక వర్గానికి కేటాయించినపుడు పార్టీ లో ముసలం కలిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్ బీసీ గర్జన సభ ను చూసిన జనాలు వీటన్నింటినీ గుర్తు చేస్తున్నారు. పైగా 13 జిల్లాలలో ఏ జిల్లా కు కూడా జగన్, బీసీ లని అధ్యక్షులు గా నియమించలేదు అని వారు గుర్తు చేస్తున్నారు. జిల్లా సమన్వయ కమిటీ లకి అధ్యక్షులను నియమించే సమయం లో గుర్తు రాని బీసీ లు ఇప్పుడు ఎన్నికల సమయంలో గుర్తు కి వస్తున్నారు అని వారు అంటున్నారు.
మరి ఈ ప్రశ్నలకు వైఎస్ఆర్ సీపీ నేతలు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాల్సిందే.