” రేపు 22వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. టీడీపీకి నాలుగు ఎమ్మెల్సీలొస్తాయి. వైసీపీకి ఒక్కటే వస్తుంది. ఆ ఒక్కటీ.. ఒక్కటీ… జంగా కృష్ణమూర్తికి ఇచ్చేస్తున్నా…” … బీసీల కోసం.. తన సర్వస్వాన్ని త్యాగం చేస్తున్నట్లుగా… బీసీల సదస్సులో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన.
నిజానికి జంగా కృష్ణమూర్తికి జగన్ చేసిన దారుణమైన అన్యాయం అది. ఆయన గురజాల నుంచి అసెంబ్లీ టిక్కెట్ ఆశించారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. పార్టీ బలోపేతం కోసం పని చేశారు. కానీ కారణం ఏమిటో తెలియదు కానీ..ఆయనను పక్కన పెట్టేసి.. కాసు మహేష్ రెడ్డిని తెచ్చి గురజాలలో టిక్కెట్ ఖరారు చేశారు జగన్. ఆయను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పించేసి.. ఎమ్మెల్సీ ఇస్తున్నట్లుగా చెప్పుకొచ్చి.. గొప్ప సాయం చేసినట్లు ప్రకటించారు. అది న్యాయమా..? అన్యాయమా …?
బీసీలకు జగన్మోహన్ రెడ్డి మార్క్ న్యాయం… మొదటి నుంచి ఆ పార్టీలో ఉంది. గౌరవ అధ్యక్షురాలి నుంచి… కింది స్థాయిలో.. చివరికి కోఆర్డినేటర్ల వరకూ.. ఆయన పార్టీలో.. బీసీలకూ ఎక్కడా గౌరవ ప్రదమైన స్థానం దక్కలేదు. పార్టీలో, పదవుల్లో కీలక స్థానాల్లో ఒక్కరంటే ఒక్క బీసీ నేత లేరు.
- గౌరవ అధ్యక్షురాలు – రెడ్డి
- జాతీయ అధ్యక్షుడు రెడ్డి
- తెలంగాణ శాఖ అధ్యక్షుడు – రెడ్డి
- మాజీలయిన ఏడుగురు ఎంపీలు – ఆరుగురు రెడ్డి , ఒకరు రిజర్వుడు కేటగిరి
- ఇద్దరు రాజ్యసభ సభ్యులు – రెడ్డి
- పీఎసీ చైర్మన్ – రెడ్డి
- ఏడు లోక్సభ రీజనరల్ కోఆర్డినేటర్లు – ఏడుగురూ రెడ్డి
- ఏడుగురు ఎమ్మెల్సీల్లో – ముగ్గురు రెడ్డి – ఇద్దరు ఓసీ – ఇద్దరు బీసీ
- వైసీపీ రైతు విభాగం – నాగిరెడ్డి
- వైసీపీ మహిళా విభాగం – రోజా రెడ్డి
ఇలా చెప్పుకుంటూ.. పోతే.. పార్టీలో ఎక్కడా… బీసీ నేతలకు… ప్రాధాన్యం దక్కలేదు. ఒక వేళ పొరపాటున.. ఎవరికైనా.. బీసీకి… పార్టీలో ఓ మాదిరి పదవి వస్తే.. అది అలంకారంగా మాత్రమే ఉంటుంది. దానికి సంబంధించి… ఎవరూ..ఎలాంటి కార్యక్రమాలు అసైన్ చేయరు. సాక్షి మీడియా కూడా వారిని పట్టించుకోదు. కానీ.. రెడ్డి సామాజికవర్గ నేతలు.. ఎవరైనా… ఓ కార్యక్రమం చేపట్టారంటే మాత్రం దానికి.. భారీ ప్రయారిటీ లభిస్తుంది. ఉదాహరణకు.. వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా … అని ఎంత మందికి తెలుసు..? ఆయనను ఓ సారి పోలీసులు అకారణంగా కొడితే… వైసీపీ నేతలు కాదు కదా.. సాక్షి మీడియా కూడా పట్టించుకోలేదు. వైసీపీకి ఇతర విభాగాలు కూడా ఉన్నాయి. ఆ సమాచారం ఎవరికీ దొరకదు. ఆ పదవుల్లో ఎవరున్నారో.. వారికి తప్ప .. ఇంకెవరికి సమాచారం ఉండదు.
నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో… ముఖ్యమంత్రి పదవికి పోటీ పడిన బొత్స లాంటి వారి దగ్గర్నుంచి అనేక మంది బీసీ దిగ్గజల్లాంటి నేతలు ఉన్నారు. వారెవరికైనా..ఇప్పుడు నియోజకవర్గ స్థాయికి మించి ప్రాధాన్యత లభిస్తోందా..? అంటే.. ఎవరైనా లేదనే చెబుతారు. చివరికి ఆయా నేతలకు టిక్కెట్లు కూడా గ్యారంటీ లేదని చెబుతున్నారు. బొత్స, ధర్మాన లాంటి వాళ్లు సర్దుకుపోతున్నా.. జగన్ అవమానాలను తట్టుకోలేక… కొణతాల, దాడి వీరభద్రరావు సహా.. ఎంతో మంతి.. బయటకు వెళ్లిపోయారు. ఇప్పుడు వైసీపీలో .. చెప్పుకోవడానికి… ఒక్కరంటే.. ఒక్క నిఖార్సయిన బీసీ నేత లేరు. ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వలేరు.
ఈ విషయంలో తెలుగు దేశం పార్టీ.. ఎప్పటికప్పుడు… సామాజిక న్యాయం కోణంలో… పదవులు పంపిణీ చేయడానికి వీలైనంతగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
- టీడీపీ జాతీయ అధ్యక్షుడు – కమ్మ
- ఏపీ టీడీపీ అధ్యక్షుడు – బీసీ
- తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు – బీసీ
- రాజ్యసభ సభ్యులు ఐదుగురు – ఇద్దరు కమ్మ, ఒకరు వెలమ, ఒకరు ఆర్యవైశ్య, మరొకరు బీసీ
- లోక్సభ ఎంపీలు – ఆరుగురు బీసీలు
- 25 మంది కేబినెట్లో 8 మంది బీసీలు, నలుగురు కాపు మంత్రులు
ఇక అనుబంధ సంఘాల్లో… చంద్రబాబునాయుడు సామాజిక న్యాయం పాటించడానికి ప్రయత్నిస్తున్నారు. వీలైనంత వరకు… ఎంతగా ఒత్తిడి వచ్చినప్పటికీ… బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడు.. ఏ కేబినెట్ తీసుకున్నా… బీసీ మంత్రులే ఎక్కువగా ఉంటారు. వైఎస్ కేబినెట్ తో పోలిస్తే.. ఉమ్మడి రాష్ట్రంలో.. కనీసం నలుగురు బీసీ మంత్రులు ఎక్కువగా ఉండేవారు.
నిజానికి బీసీల పార్టీ అంటే.. టీడీపీనే అన్న పేరు ఉంది. తెలంగాణలో… బీసీ నేతలు… అందరూ.. టీడీపీ నుంచి ఎదిగిన వారే. దేవందర్ గౌడ్ దగ్గర్నుంచి ఎల్. రమణ సహా.. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉండి.. టీడీపీపై… దుమ్మెత్తి పోస్తున్న తలసాని సహా.. అందరూ.. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయంగా ఎదిగిన వారే. టీడీపీ పాలనలో ఆర్థికంగా ఎదిగారు బ బీసీ వర్గాలు. ఏపీలోనూ… వారు.. ఎక్కువగా ఉన్నారు. హిందూపురం లోని నిమ్మల కిష్టప్ప దగ్గర్నుంచి శ్రీకాకుళం ను ఎర్రన్నాయుడు వరకు.. బీసీ నేతలు లెక్క లేనంత మంది ఉన్నారు. రాజకీయంగా రాజ్యాధికారాన్ని బీసీలు టీడీపీ ద్వారానే సాధించకోగలిగారు. టీటీడీ చైర్మన్ గా..ఓ బీసీని చంద్రబాబు నియమించారు. ఏ విధంగా చూసినా.. జగన్ చెప్పే సామాజిక న్యాయం… ఆయన వర్గానికే పరిమితం.. కానీ టీడీపీ విషయంలో విమర్శలు మాత్రం… లెక్కలు నిజాలు మాట్లాడతాయి.