అనిల్ రావిపూడి డైరక్షన్ లో మహేష్ బాబు చేయబోయే సినిమాలో నిర్మాత దిల్ రాజు భాగస్వామ్యం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు అనిల్ సుంకరదే. అయితే ఇందులో దిల్ రాజు కూడా భాగస్వామ్యం కూడా వుంటుందని, కాదు..కాదు, అనిల్ సుంకరనే సోలో ప్రొడ్యూసర్ అని వార్తలు వచ్చాయి.
అయితే లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, దిల్ రాజు భాగస్వామ్యం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సూత్రప్రాయంగా అనిల్ సుంకరకు, దిల్ రాజుకు మధ్య మాటలు జరిగినట్లు బోగట్టా. అయితే మూడో బ్యానర్ గా మహేష్ బాబు బ్యానర్ వుంటుందా? వుండదా? అన్నది ఇంకా తెలీదు.
సుకుమార్ తన స్క్రిప్ట్ కు టైమ్ అడిగిన సంగతి, అనిల్ రావిపూడికి మహేష్ ఒకె చెప్పిన సంగతి తెలిసిందే. ఈమేరకు అనిల్ రావిపూడి తన టీమ్ తో స్క్రిప్ట్ వర్క్ లో బిజీ అయిపోయారు. మహర్షి అయిన తరువాత నెల గ్యాప్ తీసుకుని, ఈ సినిమా మీదకు వస్తాడు మహేష్.