వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏలూరులో అనుచరులతో ధర్నాకు దిగారు. సోషల్‌మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని , తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి దుష్ప్రచారాలకు దిగుతున్నారంటూ ఎస్పీకి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే..
సోషల్ మీడియాలో నిన్న ఒక వీడియో వైరల్ గా మారింది. చింతమనేని ప్రభాకర్ దళితులను ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఆ వీడియోలో చింతమనేని దళితులను ఉద్దేశించి, “మీరు దళితులు, మీరు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు, మీరు వెనుకబడిన తరగతుల వాళ్ళు, రాజకీయాలు మాకు ఉంటాయి, మాకు పదవులు, మీకెందుకు రా పిచ్చముండా కొడకల్లారా కొట్లాట” అంటూ చేసిన వ్యాఖ్యలకి సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియో పూర్తి వీడియో కాకపోవడంతో, ఈ వ్యాఖ్యలకు ముందు ఈ వ్యాఖ్యల తర్వాత చింతమనేని మాట్లాడారన్న దానిపై క్లారిటీ లేదు, అదేవిధంగా ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు అన్నాడు అన్న దానిపై కూడా స్పష్టత లేదు. అయితే, తన ఉద్దేశ్యం ఏదైనప్పటికీ దానిని వ్యక్తపరిచిన విధానం మాత్రం అభ్యంతరకరంగా ఉండడంతో, ఈ వీడియో చూసిన వారంతా చింతమనేని పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే తనను రాజకీయంగా ఎదుర్కోలేకే కొందరు కావాలనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ ఇప్పుడు చింతమనేని రివర్స్‌లో ధర్నాకు దిగారు.
మరి ఇటువంటి అరోపణలు వచ్చిన చింతమనేని పై చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకుంటారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.