ఏపీలో ఉద్దేశపూర్వకంగా ఓట్లను తొలగిస్తున్నారని.. సర్వేల పేరుతో.. టీడీపీ నేతలే ఓట్లు తొలగిస్తున్నారని… వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్ని.. ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఓట్ల తొలగింపుపై జరుగుతున్న ప్రచారం, చేస్తున్న ఆరోపణలన్నీ పుకార్లేనని.. ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ తేల్చి చెప్పారు. ఓటు తొలగించాలంటే.. చాలా ప్రక్రియ ఉంటుందన్నారు. సంబంధిత అధికారి ఫారం 7 ను పూర్తి చేయాలని దానిని వీఆర్వో నుండి ఎమర్వో వచ్చిన తర్వాత కలెక్టర్ పరిశిలించి.. ఆ తర్వాత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపుతారన్నారు. అక్కడ పరిశీలించిన తర్వాతే ఓట్ల తొలగింపు సాధ్యమవుతుందన్నారు.
ఉరికినే.. రాజకీయం కోసం.. ఓట్ల తొలగింపు ఆరోపణలు చేయవద్దని ద్వివేదీ రాజకీయ పార్టీలను కోరారు. స్పెసిఫిక్ గా ఏమైనా ఉంటే.. ఆధారాలు సమర్పిస్తే విచారణ చేయిస్తామన్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఓట్లు తొలగించినట్లు తేలితే.. క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నెల 23, 24న ఏపీ వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల జాబితా పరిశీలన ఉంటుందన్నారు. దీనిని రాజకీయ పార్టీలు, ఓటర్లు వినియోగించుకోవాలని కోరారు. కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు… నియోజకవర్గానికి పదివేల ఓట్ల చొప్పున తొలగిస్తున్నారని పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి అదే ఫిర్యాదు చేశారు. కోర్టులోనూ పిటిషన్లు వేశారు. ప్రతి రోజూ ఓ నియోజకవర్గానికి చెందిన నేతలను.. ఈసీ వద్దకు పంపి.. తమ నియోజకవర్గంలో పది వేల ఓట్లు తొలగించారని రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నారు. కానీ.. తొలగింపునకు గురైన ఓట్ల జాబితాలను మాత్రం అందించడం లేదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆరోపణలు మరీ ఎక్కువైపోవడంతో.. ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ కాస్త ఘాటుగానే హెచ్చరికలు జారీ చేశారు. స్పెసిఫిక్ గా చెబితే విచారణ చేస్తాం కానీ.. రాజకీయాల కోసం.. రాజకీయ ఆరోపణలు ఈసీ మీద చేయవద్దని స్పష్టం చేశారు. మరి వైసీపీ ఇప్పటికైనా.. ఈ విషయంలో సంతపృప్తి చెందుతుందో… అలా ఓట్ల గల్లంతు ఆరోపణల్ని.. ఎన్నికల వరకూ.. ఎన్నికలు అయిన తర్వాత కూడా కొనసాగిస్తుందో చూడాలి..!