కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ…శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి నుంచి గంటన్నరలోనే తిరుమలకు నడుస్తూ చేరుకున్నారు. రాహుల్ తో పాటు వచ్చిన వారందరూ.. మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. భద్రతా సిబ్బంది పరుగులు పెట్టాల్సి వచ్చింది. అయినా అలిపిరిలో నడక ప్రారంభించిన రాహుల్ గాంధీ ఎక్కడా ఆగలేదు. మెట్లు ఉన్న చోట… రోడ్డు మార్గంలోనూ.. వడివడిగా నడుచుకుంటూ వెళ్లిపోయారు. అలిపిరి నుంచి.. నిట్ట నిలువుగా… దాదాపుగా ఏడు కిలోమీటర్ల దూరం … తిరుమల ఉంటుంది. సామాన్యులకు కనీసం నాలుగు గంటల సమయం పడుతుంది. బాగా ఫిట్ నెస్ మెయిన్ టెయిన్ చేసే వాళ్లు మాత్రం… మూడు గంటల్లో వెళ్లగలరు.
కానీ రాహుల్ గాంధీ మాత్రం.. గంటన్నరలోనే నడక పూర్తి చేశారు. గతంలో… పలువురు ప్రముఖలు.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి నడక మార్గంలో తిరుమల వెళ్లారు కానీ.. ఇంత వేగంగా వెళ్లిన వాళ్లెవరూ లేరు. కొన్నాళ్ల కిందట.. ముఖ్యమంత్రి చంద్రబాబు 60 ప్లస్ వయసులో నడక మార్గం ద్వారా తిరుమలకు వెళ్లారు. దీనికి కోసం చంద్రబాబుకు పట్టిన సమయం 2 గంటల 40 నిమిషాలు. ఇటీవల పాదయాత్ర ముగించుకున్న తర్వాత వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా… కాలినడకన తిరుమలకు వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి.. దీని కోసం మూడున్నర గంటల సమయం తీసుకున్నారు. జగన్ . మెగా బ్రదర్స్ కూడా.. గతంలో కాలి నడకన వెళ్లారు.
చివరికి.. ఏకంగా ఏడున్నర గంటలు సమయం తీసుకున్నారు. పవన్ కల్యాణ్ మూడున్నర గంటలు సమయం తీసుకున్నారు. ఆ సమయంలో మెగా బ్రదర్స్ పడిన అవస్థలు, ఫోటోలు.. మీడియాలో వైరల్ అయ్యాయి. ఎక్కడా అలసట లేకుండా నడవడం ద్వారా రాహుల్ గాంధీ.. ఫిట్ నెస్ విషయంలో తనతో ఎవరూ పోటీ పడలేరని నిరూపించారు.