నెట్ ఫ్లిక్స్, అమేజాన్‌ల కాలం ఇది. వెబ్ సిరీస్‌కి మంచి డిమాండ్ పెరుగుతోంది. అగ్ర సంస్థలు కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టాలని ఉవ్వీళ్లూరుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలో ఓ వెబ్‌సిరీస్ రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కల్యాణ్ రామ్ ఈ వెబ్ సిరీస్‌కి నిర్మాతగా వ్యవహరిస్తారు. ఇదో ప్రేమ కథ. క్రైమ్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయట. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లబోతోంది. “నెట్ ఫ్లిక్స్, అమేజాన్‌లో వచ్చే సిరీస్‌లు యూత్‌ని టార్గెట్ చేసుకుంటూ వచ్చినవే. మేం కూడా అదే పంథా ఫాలో అవ్వబోతున్నాం. నేను నెట్ ఫ్లిక్స్‌లో వచ్చే వీడియోలు తప్పకుండా చూస్తుంటా. డాక్యుమెంటరీలంటే చాలా ఇష్టం. వెబ్ సిరీస్ ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇస్తే… భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు రూపొందింస్తాం“ అంటున్నారు కల్యాణ్‌రామ్. ఆయన కథానాయకుడిగా నటించిన 118 మార్చి 1న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. గుహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.