ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగైనా.. తెలుగుదేశం పార్టీని ఓడించి.. వైసీపీని గెలిపించాలన్న పట్టుదలతో.. రిటర్న్ గిఫ్ట్ రాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుమారుడు.. ఎక్కడ అవకాశం ఉంటే.. అక్కడ .. టీడీపీ ఓడిపోతుందని.. ఈ సారి చంద్రబాబు.. ఎక్కడా చక్రం తిప్పలేని చెప్పడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేసిన కేటీఆర్… చంద్రబాబు… కచ్చితంగా ఓడిపోతారని.. మరోసారి జోస్యం చెప్పారు. ఏపీలో వైసీపీ తప్పకుండా జగన్ గెలుస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. జగన్‌ను కేసీఆర్..కలవాల్సిన టైంలో కలుస్తారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ విషయంలో చంద్రబాబు ఎన్ని భావోద్వేగాలను రెచ్చగొట్టినా ఏపీ ప్రజలు పట్టించుకోరని ధీమా వ్యక్తం చేశరు. చంద్రబాబు ఢిల్లీలో కాదు.. విజయవాడలో కూడా చక్రం తిప్పలేరని చెప్పుకొచ్చారు.
దేశంలో … రాష్ట్రాల అధికారాలను కబ్జా చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందన్న అంశంపై.. మిగతా ప్రాంతీయ పార్టీలన్నీ పోరాడుతూంటే.. టీఆర్ఎస్ మాత్రమే సైలెంట్‌గా ఉంది. ఇలాంటి విషయాల్లో బీజేపీకి అవుట్రైట్గా సపోర్ట్ చేస్తూ.. ఎన్నికల ఫలితాల తర్వతా ఫెడరల్ ఫ్రంట్ క్రియాశీలకంగా అవుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కలసి రాని పార్టీని.. తర్వాత ఇతర పార్టీలు ఎందుకు కలుపుకుంటాయనే లాజిక్‌ను.. కేటీఆర్ మిస్సయ్యారు. కానీ తెలంగాణలో పదహారు సీట్లు గెలుచుకుని.. దేశంలో చక్రం తిప్పేయాలన్న కోరికను మాత్రం.. బలంగా వ్యక్తీకరిస్తున్నారు. కేటీఆర్ కామెంట్లపై.. లోకేష్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. టీడీపీని ఓడించడానికి కేసీఆర్, కేటీఆర్, మోడీ చేసే ప్రయత్నాలకు భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు. ” ఢిల్లీ మోడీ గారు, తెలంగాణ మోడీ కేసిఆర్ గారు, ఆంధ్రా మోడీ జగన్ గారికి కలలో కూడా చంద్రబాబు గారే గుర్తుకొస్తున్నారు అన్న విషయం ఈ రోజు కేటీఆర్ గారి మాటల్లో బయటపడింది. ఫెడరల్ ఫ్రంట్ అంటూ చక్రం తిప్పి 420 పార్టీతో జత కట్టిన కేసీఆర్ గారు తెలంగాణకే పరిమితమై చతికలపడ్డారు. ఒక్క నాయకుడిని ఎదుర్కోలేక ముగ్గురు నాయకులు ఒక్కటై ఎన్నో కుట్రలు చేస్తున్నారు..” అని విమర్శలు గుప్పించారు. జగన్‌తో చేతులు కలిపి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే భారీ ప్రణాళికలతో తెరాస ముందుకొస్తున్న విషయం కేటీఆర్ మాటల్లో తేలిపోయిందని.. లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
మొత్తానికి రాను రాను రాజకీయం… టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా కాకుండా.. టీడీపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా మారబోతోందనడానికి.. కేటీఆర్ వ్యాఖ్యలు.. దానికి లోకేష్ ఇచ్చిన కౌంటర్ సూచనల్లా కనిపిస్తున్నాయన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఇప్పటికే.. జగన్ పార్టీ కోసం.. కేసీఆర్‌కు సర్వేలు చేసి పెట్టిన సంస్థలు.. రంగంలోకి దిగాయని.. వాటి ఆధారంగా.. కొంత మంది టీడీపీ నేతల్ని కూడా.. వైసీపీలోకి పంపే కార్యక్రమాలను.. టీఆర్ఎస్ నేతలు చేస్తున్నారన్న ప్రచారం గట్టిగానే సాగుతోంది. ఈ సమయంలో కేటీఆర్ వ్యాఖ్యలు మరింత హీట్ పెంచాయి.