సంక్రాంతి పండుగ సమయంలో.. పవన్ కల్యాణ్ ఓ సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటన సారాంశం…” వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… పొత్తు కోసం.. టీఆర్ఎస్ నేతలతో సంప్రదింపులు జరిపిస్తోంది..” అనేది ఆ ప్రకటన సారాంశం. ఈ ప్రకటన ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనం ఏమీ కాలేదు. ఎందుకంటే.. చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ .. ఆ దిశగా… సక్సెస్ కావాలంటే.. జగన్, పవన్ కలవాలని.. ఓ ఈక్వేషన్ రెడీ చేసుకున్నారు. దాని ప్రకారమే.. పవన్ కల్యాణ్‌తో.. టీఆర్ఎస్ నేతలు సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. దానికి రాజ్‌భవన్ మధ్యవర్తిత్వం చేసింది. ఎలాంటి హోదాలు లేనప్పటికీ.. జనసేన పార్టీ పెట్టిన మూడేళ్ల పాటు… పవన్ కల్యాణ్‌ను పట్టించుకోని… రాజ్‌భవన్… ఓ ఈవెంట్‌కు మాత్రం.. పవన్‌ను ఆహ్వానించారు. అక్కడ పవన్ కల్యాణ్, కేసీఆర్ మధ్య చర్చలు జరిగాయి.
తర్వాత పవన్ కల్యాణ్ .. సీఎం క్యాంపాఫీస్.. ప్రగతి భవన్‌కు వెళ్లారు. అక్కడ పవన్‌ను రెండు గంటలు వెయిట్ చేయించుకున్నప్పటికీ.. భోజనం పెట్టి.. కాసిని మాటలు చెప్పి పంపిచారు. కారణం అదో కాదో కానీ..ఆ తర్వాత పవన్ కల్యాణ్ టీడీపీకి వ్యతిరేకమయ్యారు. అప్పట్నుంచే.. జగన్‌పై సాఫ్ట్ కార్నర్ చూపించడం ప్రారంభిచారు. ఆ పరిస్థితి.. ఇద్దరి మధ్య పొత్తులు పెట్టుకునేలా ప్రొత్సహించే వరకూ వెళ్లింది. ఈ క్రమంలో… ఆ బాధ్యతలు సినిమాటోగ్రఫి మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ తీసుకున్నారు. ఆయనే పవన్ కల్యాణ్‌తో పొత్తుల విషయం చర్చించడానికి సిద్ధమయ్యారు. కానీ పవన్ కల్యాణ్… మాత్రం పడనీయలేదు. ఎందుకంటే… అంతకు ముందే.. జగన్మోహన్ రెడ్డి.. పవన్ కల్యాణ్‌ను వ్యక్తిగతంగా దూషించారు. అప్పట్నుంచి మళ్లీ రెండు పార్టీల మధ్య వైరం ప్రారంభమయింది.
ఎలాగూ పవన్ కల్యాణ్ పొత్తు వద్దన్నారు కాబట్టి.. ప్లాన్ బీ అమలు చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా.. జనసేన – టీడీపీ ఒకటే అని చెప్పడం ప్రారంభించారు. ప్రత్యామ్నాయం జగనే అంటున్నారు. పవన్‌తో వైసీపీ పొత్తు కోసం… ప్రయత్నించిన విషయాన్ని తలసాని పరోక్షంగా అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడుతూ తలసాని బయటపెట్టారు. జనసేనతో వైసీపీ పొత్తు లేకపోయినా.. విడిగా పోటీ చేసినా టీడీపీకే నష్టమంటూ… వ్యాఖ్యానించి.. తను చేసిన రాజకీయం గుట్టు బయటపెట్టారు.