ఆస్కార్ అవార్డుల్లో భారతీయ చిత్రానికి చోటు లభించడం అంటే మాటలా..?? అదో కల! ఆస్కార్ వేదికపై మన నటీనటులు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందుకోవడం ఓ చరిత్ర. ఆ చరిత్రకు 2019 ఆస్కార్ పురస్కారాల వేదిక ఓ సాక్ష్యంగా నిలిచింది. `పిరియేడ్ ఎండ్ ఆఫ్ సంటెన్స్` అనే లఘు చిత్రానికి షార్ట్ ఫిల్మ్ విభాగంలో బెస్ట్ డాక్యు మెంటరీ పురస్కారం దక్కింది. టబు ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రమిది. ఆడవాళ్ల నెలసరి సమస్యని తెరపై చూపించే ప్రయత్నం చేశారు. సానిటరీ న్యాప్ కిన్స్ కి ఆద్యుడైన ప్యాడ్మెన్ అరుణాచలం కూడా ఈ లఘు చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషించడం విశేషం. ఒక భారతీయ లఘు చిత్రానికి ఆస్కార్ దక్కడం ఆస్కార్ చరిత్రలోనే ఇదే ప్రధమం. ఈ షార్ట్ ఫిల్మ్ని త్వరలోనే నెట్ఫ్లిక్స్ ద్వారా చూడొచ్చు.