జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ కూడా.. అదే జిల్లాలో ఉన్నారు. అనూహ్యంగా ఇద్దరూ ఒకే సారి.. ఒకే జిల్లాలో ఉండటం వెనుక…. రాజకీయంగా వ్యూహాత్మకంగా.. వేసిన స్కెచ్ ఉంది. కానీ.. ఆ స్కెచ్ పవన్ కల్యాణ్ వేయలేదు. పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన స్కెచ్ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసలు విషయం ఏమిటంటే.. సాక్షి టీవీ తరపున… ఓ షో చేయడానికి రేణుదేశాయ్.. ఒప్పందం చేసుకున్నారు. రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ఏపీలో రైతుల పరిస్థితి దుర్భరంగా ఉందని.. రేణుదేశాయ్ యాంకరింగ్ ద్వారా.. ఆ షోలో చెప్పించాలని నిర్ణయించారు. అందులో భాగంగా.. ఆమె.. మరో యాంకర్ స్వప్నతో కలిసి మంత్రాలయం వెళ్లారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబంతో మాట్లాడారు. ఆ మేరకు షో షూటింగ్ జరుగుతోంది.
యాధృచ్చికంగా పవన్ కల్యాణ్… కర్నూలు జిల్లాలో రాజకీయ పర్యటన జరుపుతున్న సమయంలో… రేణుదేశాయ్… అదే జిల్లాలో ప్రత్యక్షమవడం…సహజంగానే.. రాజకీయవర్గాల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. వ్యూహాత్మకంగా…పవన్ కల్యాణ్ ను ఆత్మరక్షణ ధొరణిలో పడేసి… జగన్‌ను కంట్రోల్ చేయడానికే… ఈ ప్రయత్నం చేశారన్న విమర్శలు జనసేన వైపు నుంచి వస్తున్నాయి. పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత ఆమె.. చాలా కాలం ఒంటరిగానే ఉన్నారు. ఇటీవలి కాలంలో.. రెండో వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విరుచుకుపడుతూండటంతో… ఆమె సోషల్ మీడియా అకౌంట్లను తొలగించారు.
కొన్నాళ్ల క్రితం.. .. సాక్షి మీడియాకు ఓ ఇంటర్యూ ఇచ్చారు. అప్పుడు ఆమెను… స్వప్ననే ఇంటర్యూ చేసింది. ఎన్నికల సమయంలో.. రేణుదేశాయ్ .. పవన్ కు కౌంటర్ ఇవ్వడానికి బాగా ఉపయోగపడతారన్న ఉద్దేశంతో.. ఇలా ఆమెను.. సాక్షి టీవీలో యాంకరింగ్ కు తీసుకున్నట్లు రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే పవన్ కల్యాణ్ ను రాజకీయంగా ఎదుర్కోవడానికి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేయడం ఏమిటన్న విమర్శలు సహజంగానే ఇతర పార్టీల నుంచి వస్తున్నాయి. వాటిని వైసీసీ అంతే సహజంగా లైట్ తీసుకుంటుంది.