అమరావతిలో రెండు ఎకరాల్లో ఓ ఇల్లు..మరో పార్టీ ఆఫీస్ నిర్మించుకున్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి.. గృహప్రవేశ లాంఛనాన్ని కూడా పూర్తి చేస్తున్నారు. కొత్త ఆఫీసులో దగ్గుబాటి, ఆమంచి వంటి నేతల చేరికలతో… జోష్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే… పార్టీ కార్యక్రమాలు అక్కడ్నుంచే జరుగుతాయా.. అంటే… వైసీపీ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. కేవలం అధికారికంగా.. గృహప్రవేశం నిర్వహిస్తున్నారు కానీ.. ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రమే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి.. గృహప్రవేశ కార్యక్రమం ఉంటుందని.. వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి వరకూ లోటస్‌పాండ్ వేదికగా.. అంటే.. ఈ ఎన్నికల వ్యూహం, కార్యాచరణ.. మొత్తం… లోటస్‌పాండ్‌లోనే జరుగుతాయని చెబుతున్నారు. ఎన్నికల ముందు వరకూ .. ఏపీకి రాని ప్రతిపక్ష నేత .. ఏపీలో ఎలా రాజకీయాలు చేస్తారనే విమర్శలు వస్తూండటంతోనే గృహప్రవేశాన్ని నిర్వహిస్తున్నారని అంటున్నారు.
ఇల్లు, పార్టీ కార్యాలయం ఇంకా ఫినిషింగ్ స్టేజ్‌లోనే ఉన్నాయి. మొత్తంగా ఆ ఇల్లు రెండు విభాగాలుగా ఉంటుంది. ఒకటి ఇల్లు, రెండు పార్టీ ఆఫీసు. ఇల్లు పెద్దగా.. పార్టీ ఆఫీసు కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఇంట్లో యాభై గదుల వరకూ ఉండవచ్చని… ఆ ఇల్లు సైజుని బట్టి నిర్మాణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. బెంగళూరు యలహంక ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ పాండ్లకు తీసిపోని రీతిలోనే ఇంటి నిర్మాణం జరుగుతోంది. కానీ.. పార్టీ కార్యక్రమాలను ఇక్కడి నుంచే నిర్వహిచడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు లేవన్న కారణంగా… ఇప్పటికైతే.. కేంద్ర కార్యాలయం… హైదరాబాద్ నుంచే నడపనున్నారు. తాను అమరావతికి మకాం మార్చానని అనిపించడానికి ఒకటి, రెండు రోజులు మాత్రం… జగన్మోహన్ రెడ్డి కొత్త ఇంట్లో ఉంటారని చెబుతున్నారు.
ఎలా చూసినా.. జగన్మోహన్ రెడ్డి ఇళ్ల ప్రస్థానంలో.. ఇది మరో మైలురాయి అనుకోవాలి. వైఎస్ సీఎం అవగానే.. పులివెందులలో ఒకటి.. కడపలో మరొ ప్యాలెస్ కట్టారు. ఆ తర్వాత బెంగుళూరు శివార్లలోని యలహంకలో కట్టిన భవనం… నేషనల్ హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఆ తర్వాత లోటస్‌పాండ్ చరిత్ర..సీబీఐ రికార్డులకు ఎక్కింది. ఇప్పుడు అమరావతి ఇల్లు. ఏ ఇల్లు అయినా … అంచనాలకు మించే ఉంటుంది. కానీ ఏ ఇంట్లోనూ.. జగన్ ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి.. గత పదేళ్ల నుంచి ఉంది.