ఉగ్రవాద శిబిరాలపై ధ్వంసం చేయడాన్ని పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతోంది. ప్రతీకారం అంటూ.. ఈ రోజు భారత భూభాగంలోకి… ప్రవేశించి బాంబు దాడులు చేశారు. భారత్‌ను మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేసారు. సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పటి నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్ … భారత గగనతలంలోకి ప్రవేశించి పలు ప్రాంతాల్లో బాంబులు వేసి.. యుద్ధవాతావరణాన్ని సృష్టించాయి. భారత్‌లో తమ యుద్ధ విమానాల ప్రవేశించాయని పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. భారత్‌కు చెందిన రెండు భారత యుద్ధ విమానాలను నేల కూల్చామని ప్రకటించుకుంది. నేల కూలిన విమానాల్లో ఒకటి పీఓకేలో పడిందని.. మరొకటి ఇండియాలో పడిందని చెప్పుకొచ్చారు. పీవోకేలో పడిన విమానం పైలట్‌ను ప్రాణాలతో పట్టుకున్నామని ప్రకటించారు.
పాకిస్తాన్ ఈ ప్రకటన చేయడానికి కొంచెం ముందు.. శ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో ఒక యుద్ధవిమానం కూలిపోయింది. సాంకేతిక కారణాలతోనే విమానం కూలిపోయిందని అధికారవర్గాలు చెబుతున్నారు. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. ఈ ఘటన జరగడానికి కొద్ది సేపటి ముందు నియంత్రణ రేఖకు అత్యంత సమీపంలో పాకిస్థాన్‌కు చెందిన విమానాలు సంచరించాయి. సరిహద్దులు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్ వాయుసేన యుద్ధవిమానాన్ని భారత్ దళాలు కూల్చివేశాయి. ఈ విమానం నౌషెరా సమీపంలోని పాక్ పరిధిలోకి వచ్చే లామ్ లోయలో కూలిపోయింది.
ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే.. రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమయినట్లుగా మారింది. ఉగ్రవాదులపై దాడులు చేసినా.. పాకిస్థాన్ ఓర్చుకోలేకపోతోంది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద శిబిరాలు పెద్ద ఎత్తున ధ్వంసం అవడంతో.. అక్కడి సైన్యంలో కూడా అసహనం పెరిగిపోయిందని వార్తలు వస్తున్నాయి. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పూర్తిగా సైన్యం చేతిలో కీలుబొమ్మ. ఎన్నికల్లో ఆయన అటు ఉగ్రవాదులు..ఇటు సైన్యం సహకారంతో విజయం సాధించారు. భారత్ విషయంలో.. ఏం చేయాలన్న సైన్యమే నిర్ణయం తీసుకుంది. ఆ ఉగ్రవాదుల్ని సైన్యమే… పెంచి పోషిస్తూ ఉంటుందనేది బహిరంగ రహస్యం.