సార్వత్రిక ఎన్నికల ప్రకటన నేడో, రేపో రాబోతున్న సమయంలో.. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి.. తన కార్యాచరణను…రూపొందించుకోలేకపోతున్నారు. పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తిగా… పీకే టీంకు ఔట్ సోర్సింగ్ చేసి.. ఆయన తన ఇంట్లో … చోటా నేతలకు.. కండువాలు కప్పే కార్యక్రమాలు పెట్టుకుంటున్నారు. ఎన్నికల విషయంలో.. జగన్ ఏమైనా చెబుతారేమోనని… పార్టీకి చెందిన ముఖ్యనేతలు, సమన్వయకర్తలు… గురువారం.. జగన్‌తో సమావేశమయ్యారు. కానీ ఆయన మాత్రం… ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత బస్సు యాత్ర చేస్తానని.. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పి పంపించేశారు.
పాదయాత్ర ముగిసి దాదాపుగా రెండు నెలలు అవుతోంది. ఈ రెండు నెలల కాలంలో.. మూడు, నాలుగు కార్యక్రమాలు తప్ప.. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా.. హైదరాబాద్‌లో పరిమితమయ్యారు. ఈ మధ్యలో లండన్ కూడా వెళ్లి వచ్చారు. తాడేపల్లిలోని ఇంట్లో ఘనంగా గృహప్రవేశం చేసినప్పటికీ… ఒక్క రాత్రి మాత్రమే నిద్ర చేసి ఉదయమే హైదరాబాద్‌లో వాలిపోయారు. పార్టీ నేతలను కూడా హైదరాబాద్‌కే పిలిపించుకుంటున్నారు. ఓ వైపు చంద్రబాబు రోజంతా.. సమీక్షలు చేసి పార్టీ అభ్యర్థుల్ని ఖరారు చేస్తూంటే.. జగన్ మాత్రం.. ఆ పనిని పీకే టీంకు అప్పగించారు. మరి పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలైనా చేస్తున్నారంటే.. అదీ లేదు. పాదయాత్ర ముగిసిన తర్వాత.. పాదయాత్రలో కవర్ కాని దాదాపు అరవై నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ రెండు నెలల పాటు దాని గురించి ఆలోచించలేదు. ఇప్పుడు మాత్రం ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత బస్సు యాత్ర చేస్తానని చెబుతున్నారు.
ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత ఎప్పుడైనా బస్సుయాత్ర చేయాల్సిందే. పార్టీ అధ్యక్షుడు ఆయన అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయాల్సిన బాధ్యతల్లో ఉంటారని.. దానికి ప్రత్యేకంగా బస్సుయాత్ర అని పేరు పెట్టుకోవడం ఎందుకని వైసీపీ నేతలు గొణుక్కుంటున్నారు. ఎన్నికల ప్రకటనకు, నోటిఫికేషన్‌కు.. ఓటింగ్‌కు… 45 రోజుల సమయం ఉండొచ్చని.. ఈ సమయంలో.. ఆయన ఎన్ని నియోజకవర్గాలని తిరుగుతారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతా ఔట్ సోర్సింగ్‌కు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి… చేసే రాజకీయం ఎలా సత్ఫలితాలు ఇస్తుందని వారు మథనపడుతున్నారు.