తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న “డేటా వార్ ” రోజు రోజుకి తీవ్రమవుతోంది. జగన్ టీఆర్ఎస్ తో కుమ్మక్కు అయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు అంటూ గత కొద్దిరోజులుగా వాదిస్తున్న తెలుగుదేశం నేతలు, ఇప్పుడు డేటా వార్ ఉదంతం సందర్భంగా “ఆంధ్ర సెంటిమెంట్” తో జగన్ ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మంత్రి నారా లోకేష్, జగన్ టీఆర్ఎస్ , కేసీఆర్, కేటీఆర్ లతో కలిసి డేటా దొంగతనం చేస్తున్నాడు అంటూ పదునైన విమర్శలు చేశారు. వరుస ట్వీట్లతో, జగన్ పై వాగ్బాణాలు ఎక్కుపెట్టారు.
నారా లోకేష్ ట్వీట్ చేస్తూ, ” కేసీఆర్, జగన్ ల జోడి కేటీఆర్ మాటల్లో మరోసారి బయటపడింది. కేటీఆర్ ఇచ్చిన స్క్రిప్ట్ నే వైకాపా నాయకులు చదువుతున్నారు. వైకాపా ప్రొడక్షన్, టిఆర్ఎస్ డైరెక్షన్ లో తెలుగు దేశం పార్టీ సభ్యత్వం, సర్వే డేటా దొంగిలించారు. డేటా చోరీ చరిత్ర మీది, బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీ మాది . ఎన్నిసార్లు కోర్టు చివాట్లు పెట్టినా మీకు బుద్ది రాలేదు. అమెరికాలో పర్సు పోతే అక్కడ ఫిర్యాదు చేస్తారా? లేక హైదరాబాద్ లో చేస్తారా? ఆంధ్రప్రదేశ్ కి చెందిన డేటా పోయింది అని ఫిర్యాదు వస్తే ఏపీ పోలీసులకు కేసు బదలాయించాలి అని కూడా మీకు తెలియదా? అభివృద్ధి , సంక్షేమంలో పోటీపడలేక ఆంధ్రప్రదేశ్ లో బలహీనమైన ముఖ్యమంత్రి ఉంటే ఆంధ్రప్రదేశ్ నుండి పోటీ ఉండదు, మీ ఆటలు సాగుతాయి అనేది టిఆర్ఎస్ కుట్ర ” అని చెప్పుకొచ్చారు.
అక్కడితో ఆగకుండా, కత్తి దాడి సమయంలో కూడా వైయస్ జగన్ ఆంధ్ర ప్రదేశ్ డాక్టర్లను నమ్మకుండా హైదరాబాద్ కు వచ్చి చికిత్స చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ” జగన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిపక్ష నేతగా జీతం కావాలి, పోలీసుల నుంచి రక్షణ కావాలి, ప్రజల ఓట్లు కావాలి కానీ ఆయనకు ఏపీ పోలీసులు, డాక్టర్లు, అధికారులు, ప్రజల పై నమ్మకం ఉండదు. అందుకే తెలంగాణ లో ఉంటూ టిఆర్ఎస్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో అలజడి సృష్టించాలి అనే ప్రయత్నం చేస్తున్నారు” అంటూ జగన్ పై ఒక రేంజులో చెలరేగిపోయారు.
సరిగ్గా ఎన్నికల ముందు బయటపడ్డ ఈ డేటా వార్ ఉదంతం ఎన్నికలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.
కేసీఆర్, జగన్ ల జోడి @KTRTRS మాటల్లో మరోసారి బయటపడింది. కేటీఆర్ ఇచ్చిన స్క్రిప్ట్ నే వైకాపా నాయకులు చదువుతున్నారు. వైకాపా ప్రొడక్షన్, టిఆర్ఎస్ డైరెక్షన్ లో TDP పార్టీ సభ్యత్వం, సర్వే డేటా దొంగిలించారు. డేటా చోరీ చరిత్ర మీది, బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీ మాది #TSGovtStealsData
— Lokesh Nara (@naralokesh) March 4, 2019
జగన్ మోడీ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిపక్ష నేతగా జీతం కావాలి, పోలీసుల నుంచి రక్షణ కావాలి, ప్రజల ఓట్లు కావాలి కానీ ఆయనకు ఏపీ పోలీసులు, డాక్టర్లు, అధికారులు, ప్రజల పై నమ్మకం ఉండదు. అందుకే TS లో ఉంటూ TRS సహకారంతో ఆంధ్రప్రదేశ్ లో అలజడి సృష్టించాలి అనే ప్రయత్నం చేస్తున్నారు
— Lokesh Nara (@naralokesh) March 4, 2019